amp pages | Sakshi

టార్గెట్ కేసీఆర్

Published on Sun, 12/28/2014 - 01:22

ఇందూరు : పెట్టుబడిదారులు, కేసీఆర్ కు టుంబ సభ్యుల ప్రయోజనాల కోసమే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని, ప్రజల కోసం కాదని తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష ఉప నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌లాంటి ముఖ్యమంత్రిని ఇంతకుముందు చూడలేదన్నారు. జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ చౌరస్తాలోని మున్నూరుకాపు కల్యాణ మండపంలో శనివారం జరిగిన టీడీపీ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశం ఆ ద్యంతం టీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్ లక్ష్యంగా సా గింది.

సమావేశంలో ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలు, నాయకులు నిరసన తెలిపి వేది కపై ఉన్న టేబుల్‌ను లాగిపడేసిన సందర్భం గా టీడీపీ నేతలు, కార్యకర్తలు వారిపై విరుచుపడి చితకబాదారు. ఈ ఘటనను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలను తమ పార్టీ కార్యకర్తలు ఆడుకున్నారని పేర్కొన్నారు. ‘‘మా పార్టీ కార్యకర్తలు నిప్పురవ్వలు. కేసీఆర్... మీ పార్టీ కార్యకర్తలను పంపి చూడు మా వారిని ముట్టుకుంటే కాలిపోతా  రు. మమ్మల్ని పట్టుకుంటే కరెంట్ తీగలను పట్టుకున్నట్లే’’ అని సవాల్ విసిరారు.

అమరులకూ అన్యాయం
ప్రజలను భిక్షం ఎత్తుకునే విధంగా చేస్తున్నారని కేసీఆర్‌పై రేవంత్ విమర్శల దాడికి దిగా రు. తెలంగాణ ఉద్యమంలో వెయ్యి మందికి పైగా అమరులైతే 459 మందే ఉన్నారని చెప్పి కేసీఆర్ మిగతా బాధిత కుటుంబాలకు ఎలాం  టి ఆర్థిక సహాయం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సకల జనుల సర్వేలో కోళ్లు, మేకలు, పశువులు ఎన్ని ఉన్నాయో వివరాలు సేకరించిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు, అవయవాలను కోల్పోయినవారి వివరాలను ఎందుకు అ డిగించలేదని ప్రశ్నించారు.

జిల్లాలో గెలి చిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పనికిమాలినవారేనన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన పెద్ద మీ సాలాయన మీసాలకు సంపంగి నూనె ఇచ్చిం ది టీడీపీయేనని అన్నారు. ఇతర పార్టీల నుంచి తీసుకున్న ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించి దమ్ముంటే ఉప ఎన్నికల్లో పోటీచేయించాలన్నారు. పెన్షన్లు, రేషన్‌కార్డులు కో ల్పోయినవారి ఉసురు ఊరికే పోదన్నారు. మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడ అవకాశం కల్పించలేదన్నారు.

దళితులకు భూములిచ్చే బదులు వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేస్తే వడ్డీ నిధులతో కుటుంబాలు బతుకుతాయని సూచించారు. జిల్లాలో నడుస్తున్న ఇసుక దందాలో ఏ మంత్రి కొడుక్కు నెలానెలలా రూ. కోటి ముడుపులు ఇస్తున్నారో తెలి యదా అని ప్రశ్నించారు. టీడీపీలో కొనసాగిన సమయంలో అక్రమ ఇసుక దందాలను అడ్డుకున్న మంత్రి నేడు స్వయంగా ఇసుక దందా నడిపిస్తున్నారని ఆరోపించారు.  

రూ. లక్ష కోట్ల నిధులు వారికే
టీటీడీపీ రాష్ర్ట అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రూ. లక్ష కోట్ల నిధులను పారించి కుటుంబసభ్యులకే ధారాదత్తం చేస్తున్నాడని ఆరోపించారు. రైతన్నకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పది లక్షల సభ్యులున్న పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని, కార్యకర్తల శ్రమను టీడీపీ ఎన్నటికీ మరిచి పోదన్నారు. అనంతరం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 44 మంది రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున చెక్కులను అందజే శారు.

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు లు ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించకుండా, కేసీఆ ర్ తన కూతురు బతుకమ్మ ఆడేందుకు రూ.10 కోట్లు ఇవ్వడం దుర్మార్గమైన చర్యేనన్నారు. ఏడు మాసాల్లో 700 మందికి పైగా రైతులు చనిపోతే పట్టించుకున్న పాపన పోలే దని, రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అం దిస్తున్న టీడీపీని చూసి ఓర్వలేక దౌర్జన్యానికి పాల్పడటం తగదన్నారు.

టీడీపీ టాటా కంపెనీ లాంటిది
టీడీపీ జిల్లా కన్వీనర్ ఎమ్మెల్సీఅరికెల నర్సారెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ టాటా కంపెనీ లాంటిదని, ఎంత మంది నాయకులనైనా తయారు చేసుకునే సత్తా ఉందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నమ్ముకున్న ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు మోస పోయారని, మళ్లీ ఎన్నికల్లో టీడీపీనే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలను మొదలు పెట్టి మెడలు వంచుతామన్నా రు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిస్తే దళితుడినే ముఖ్యమంత్రిగా చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఆ హామీని మరిచిపోయాడని విమర్శించారు. సమావేశంలో టీడీపీ నాయకులు ప్రకాష్‌రెడ్డి, రాజారాం యాదవ్, అమర్‌నాథ్ బా  బు, బద్యానాయక్, తారాచంద్ నాయక్, వినో ద్, వేణు గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌