amp pages | Sakshi

మీ బస్సులు నిలపొద్దు

Published on Mon, 03/05/2018 - 02:26

సాక్షి, హైదరాబాద్ ‌: ఆంధ్రప్రదేశ్‌ బస్టాండ్లలో టీఎస్‌ఆర్టీసీ బస్సులను నియంత్రిస్తూ ఏపీఎస్‌ ఆర్టీసీ కొత్త వివాదానికి తెరలేపింది. రెండు రాష్ట్రాల మధ్య తిరిగే ఏపీ బస్సు పర్మిట్లు తగ్గిపోతున్నాయన్న కారణంతో.. విజయవాడ, గుంటూరు, ఒంగోలు, విశాఖపట్నం వంటి ముఖ్యమైన బస్టాండ్లలోకి వచ్చే తెలంగాణ ఆర్టీసీ బస్సులపై ఆంక్షలు విధిస్తోంది.

ఇప్పటివరకు తెలంగాణ బస్సులు నిలిచే ప్లాట్‌ఫామ్స్‌లోకి వాటిని అనుమతించకపోవటం, దూరంగా ఉన్న ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో నిలపాలని ఆదేశించటం, హైదరాబాద్‌కు వెళ్లే ఏపీ బస్సులను ముందు పంపి తర్వాత తెలంగాణ బస్సులను అనుమతించటం వంటి చర్యలను ఏపీ ఆర్టీసీ సిబ్బంది చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చే టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.

ఆ బస్సులు ఎక్కడ నిలుస్తున్నాయో ప్రయాణికులకు తెలియకపోవటంతో వాటిలో సీట్లు నిండటం లేదు. ఫలితంగా వారం రోజుల నుంచి తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు పెరిగాయి. విషయాన్ని సిబ్బంది ఎప్పటికప్పుడు డిపో మేనేజర్లకు బస్‌భవన్‌లోని ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ఆర్టీసీ అధికారులు విషయాన్ని ఏపీఎస్‌ ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు సమస్యను పరిష్కరిస్తామని అక్కడి అధికారులు హామీ ఇచ్చారు.

భారీగా పెరిగిన తెలంగాణ సర్వీసులు
ఆర్టీసీ విభజన సమయంలో రెండు సంస్థల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల్లో భారీ వ్యత్యాసం ఉండేది. తెలంగాణ కంటే ఏపీ బస్సులు 2.35 లక్షల కిలోమీటర్ల మేర అదనంగా తిరిగేవి. దీంతో టీఎస్‌ఆర్టీసీ క్రమంగా ఏపీకి ప్రస్తుతం 185 వరకు సర్వీసులు పెంచింది. కిలోమీటర్ల వ్యత్యాసం భారీగా తగ్గింది. ప్రస్తుతం తెలంగాణ కంటే ఏపీ బస్సులు 80 వేల కి.మీ. అదనంగా తిరుగుతున్నాయి.

మరో 120 బస్సులు ప్రారంభించేందుకు టీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నందున త్వరలో ఈ వ్యత్యాసం కూడా తగ్గనుంది. దీనివల్ల టీఎస్‌ఆర్టీసీకి రోజుకు రూ.70 లక్షల వరకు అదనపు ఆదాయం సమకూరుతోంది. ఇక విజయవాడ వరకే తిరుగుతున్న సర్వీసుల్లో కొన్నింటిని సమీపంలోని పట్టణాలకు పొడిగిస్తున్నారు. విజయవాడ బస్టాండ్‌ ఇరుగ్గా మారటం కూడా ఈ నిర్ణయానికి కారణం.

విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు మార్గాల్లో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. దీంతో సమీపంలోని పట్టణాల నుంచి హైదరాబాద్‌కు వచ్చేవారు ఆయా పట్టణాల్లోనే ఎక్కుతున్నారు. ఇది కూడా ఏపీ సిబ్బందికి కంటగింపుగా తయారైందని టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది ఆరోపిస్తున్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌