amp pages | Sakshi

‘బోరు’మంటున్న అన్నదాత

Published on Fri, 07/31/2015 - 03:05

- అడుగంటిన పాతాళగంగ!
- బీళ్లుగా మారుతున్న పొలాలు
- బోరుబావులలో తగ్గిన నీరు
- అప్పులు చేసి తవ్విస్తున్న రైతులు
- అరునా, జాడలేని జలం
కామారెడ్డి:
మాచారెడ్డి మండలం ఘన్‌పూర్(ఎం) గ్రామానికి చెందిన ఏనుగు రాంచందర్‌రావు మూడెకరాల ఆసామి. తనకున్న మూడెకరాల భూమిలో పదేళ్ల క్రితం బోర్లు తవ్వించినా లా భం లేకపోవడంతో అరకిలోమీటరు దూరంలో కొంత భూమి కొనుగోలు చేసి బోరు తవ్విం చాడు. నీళ్లు పుష్కలంగా పడ్డాయి. దీంతో అరకిలోమీటరు పై పులై ను వేయించి మంచి పంటలు తీశాడు. గత ఏడాది సరైన వర్షాలు కురవకపోవడంతో బోరు వేగం తగ్గింది. రబీ సీజన్‌లో బోరు ఇబ్బంది పెట్టడంతో రూ.15 వేలు పెట్టి మరో బోరు వేయిం చాడు. చుక్కనీరు రాలేదు. చెరుకు పంట ఎండిపోయింది. ఈ సారైనా కాలం కలిసివస్తుందని ఆశించాడు. కొద్దిగా పోసే బోరులో నీరు పెరుగుతుం దని ఆశించాడు.

వరి తూకం పోశాడు. నారుమడి మందం నీళ్లు వచ్చారు. వర్షాలు మాత్రం రాలేదు. 15 రోజుల క్రితం మళ్లీ ధైర్యం చేశాడు. ఒక బోరు 180  ధైర్యం చేశాడు. ఒక బోరు 180 అడుగులు తవ్వించినా చుక్కనీరు రాలేదు. మరో బోరు తవ్వకం మొదలుపెట్టగా నీటి పదన రావడంతో ఆశతో 280 అడుగులు తవ్వించాడు. లాభం లేకుండాపోయింది. రబీలో తవ్విన బోరుకు రూ. 15 వేలు, ఇప్పుడు తవ్విన బోర్లకు రూ. 40 వేలు ఖర్చయ్యాయి. ఇక లాభం లేదని పొలం వైపు వెళ్లడం మానేశాడు. వానలు పడితేగాని నీళ్లు వచ్చే పరిస్థితి లేదని నిర్ణయానికి వచ్చిన రాంచందర్‌రావు ఆలోచనలో పడిపోయూడు.
 
పరిస్థితి దయనీయం
జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఇప్పటికే బోర్లు వట్టిపోయి భూములు బీడువారగా, కొద్దోగొప్పో పోస్తున్న బోర్లు కూ డా ఎత్తిపోతున్నాయి. దీంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ముఖ్యంగా మెట్ట ప్రాంతమైన కామారెడ్డి డివిజన్‌లో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డా యి. ఈ సీజన్‌లో ఒక్కటైనా భారీ వర్షం కురవలేదు. దీంతో వొర్రెలు పారింది లేదు. వాగులు పొంగి ప్రవహించలేదు. చెరువులు కుంటలలోకి చుక్కనీరు చేరుకోలేదు. 50 శాతానికి పైగా లోటు వర్షపాతం నమోదైంది. కురిసిన కొద్దిపాటి వర్షాలతో భూమి తడిసినా, అది ఎందుకూ పనికిరాలేదని రైతులు వాపోతున్నారు.

దానికితోడు గ డచిన నెల రోజులుగా ఎండలు మండుతుండడంతో భూగర్భజలాలు వృద్ధి చెందకపోగా మరింత లోతుకు వెళ్లాయి. ఖరీఫ్‌లో జిల్లాలో 1.75 లక్షల హెక్టార్లలో వరి పంట సాగవుతుందని అంచనావేయగా, 25 వేల హెక్టార్లలో మాత్రమే సాగైనట్టు అధికారులు చెబుతున్నారు. మూడు లక్షల పైచిలుకు ఉన్న బోర్ల కింద ఈ సారి వరి నాట్లు నా మమాత్రమయ్యాయి. నారుమడులు పోసినా వర్షాలు లేకపోవడం, బోర్లు ఎత్తిపోతుండడంతో రైతులు నాట్లు వేయడానికి ధైర్యం చేయడం లేదు.  
 
బోర్లు తవ్విస్తూ అప్పులపాలు
వ్యవసాయం జూదంగా మారింది. రైతులు మళ్లీ బోర్ల వెంట పడ్డారు. అప్పులు చేసి మరీ తవ్విస్తున్నారు. గతంలో బోర్లు తవ్వి అప్పులపాలైన ఎన్నో కుటుంబాలు వీధినపడ్డాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతాంగం బోర్లు తవ్విస్తున్నారు. ఒక్కో రైతు ఒకటి, రెండు బోర్లు తవ్విస్తూ వేలకు వేలు నష్టపోతున్నారు. గడచిన రెండు నెలల కాలంలో కామారెడ్డి డివిజన్‌లోని మాచారెడ్డి, కామారెడ్డి, దోమకొండ, భిక్కనూరు, సదాశివగనర్ మండ లాలలో రెండు వేలకు పైగా బోర్లు తవ్వించినట్టు అంచనా. ఒక్కోబోరుకు సరాసరిగా రూ. 15 వేలు ఖర్చు చేస్తుంటే, రూ. మూడు కోట్ల వరకు బోర్ల తవ్వకానికి ఖర్చు చేసినట్టు అంచనా. అయినా బోర్లు పడకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
 
మళ్లీ గల్ఫ్‌బాట తప్పదా!
కాలం అనుకూలించకపోవడంతో చాలా మంది రైతులు వలస పోవడానికి యోచిస్తున్నారు. ‘వానల్లేవు. బోర్లు ఎత్తిపోతున్నయి. ఇగ ఎవుసం లాభం లేదు. మల్ల దుబాయ్ బోవలిసిందే’ అని  మాచారెడ్డి మండలం ఘన్‌పూర్(ఎం) గ్రామానికి చెందిన యువరైతు గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా ఎందరో రైతులు గల్ఫ్‌బాటకు స న్నద్ధమవుతున్నారు. గతంలో గల్ఫ్‌కు వెళ్లి వచ్చి ఇంటి వద్ద ఉంటూ వ్యవసాయం చేసుకుని బతుకుతున్న వేలాది మంది వర్షాభావ పరిస్థితులతో చేయడానికి పనులు లేక వలసలకే మొగ్గు చూపుతున్నారు.
 
బోర్లు తవ్వినా లాభం లేదు
వానల్లేక ఎన్ని బోర్లు ఏసినా ఏం లాభం లేదు. యాసంగి పంట మీద ఒక్క బోరు వేసిన. ఇప్పుడు రెండు బోర్లు వేసినా. చుక్క నీళ్లు రాలేదు. యాబై వేలు ఖర్చయినై. ఇగ బోర్లు తవ్వుడు లాభం లేదని అర్థమైంది. వానలు పడితేనే వ్యవసాయం నడిచెటట్టు ఉంది.
  - ఏనుగు రాంచందర్‌రావ్, ఘన్‌పూర్ (ఎం)

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌