amp pages | Sakshi

జూరాలలో రికార్డు స్థాయి విద్యుదుత్పత్తి

Published on Thu, 11/14/2019 - 05:55

గద్వాల టౌన్ : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో ఈ సారి రికార్డు స్థాయిలో అధికారులు జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రంతో పాటు దిగువన ఉన్న లోయర్‌ జూరాలలోనూ కృష్ణానదికి జూలై నెలాఖరు నుంచి వస్తున్న వరద ప్రవాహంతో రికార్డు స్థాయిలో 613.99 మిలియన్  యూనిట్ల జల విద్యుదుత్పత్తిని సాధించారు. 2008లో జూరాల జలవిద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు ఇక్కడ 270 మిలియన్  యూనిట్ల ఉత్పత్తి రికార్డుగా ఉంది.

అలాగే గత ఏడాది నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభమైన లోయర్‌ జూరాల జలవిద్యుత్‌ కేంద్రంలో 220 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తే రికార్డుగా ఉంది. తాజాగా ఈ రెండు ప్రాజెక్టుల్లోనూ ఇప్పటి వరకు ఉన్న రికార్డులను అధిగమించి విద్యుదుత్పత్తిని సాధించారు. జూరాల జలవిద్యుత్‌ కేంద్రంలో ఈనెల 12వ తేదీ వరకు 310.18 మిలియన్  యూనిట్ల విద్యుదుత్పత్తిని, లోయర్‌ జూరాలలలో 303.81 మిలియన్  యూనిట్ల ఉత్పత్తిని సాధించారు. 

రికార్డు సాధించాం..  
జూరాల, లోయర్‌ జూరాల జలవిద్యుత్‌ కేంద్రాల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయి లో ఉత్పత్తిని సాధించాం. కృష్ణానది లో జూలై నెలాఖరు నుంచి వరద కొనసాగుతుండడం వల్లే ఇది సాధ్యమైంది. టర్బైన్లలో ఇబ్బందులు తలెత్తకుండా విద్యుదుత్పత్తిని చేయడంలో జెన్ కో ఇంజనీర్లు చేసిన కృషి అభినందనీయం. వరద కొనసాగినన్ని రోజు లు విద్యుదుత్పత్తిని కొనసాగిస్తాం.

– సురేశ్, చీఫ్‌ ఇంజనీర్, టీఎస్‌జెన్ కో

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)