amp pages | Sakshi

‘కాళేశ్వరం’పై స్టేకు కారణాలు ఇవీ..

Published on Wed, 10/25/2017 - 04:28

సాక్షి, న్యూఢిల్లీ : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంపై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు గల కారణాలపై ఎన్జీటీ పూర్తి ఆదేశాల ప్రతులను వెలువరించింది. తెలంగాణలోని పాత 7 జిల్లాల్లో సాగునీటి అవసరాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టినట్టు రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారని పిటిషనర్లు విచారణ సందర్భంగా ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ 7 జిలాల్లో 2,866 హెక్టార్ల అటవీ భూమి అవసరమవుతుందని తెలంగాణ ప్రభుత్వం, ఇరిగేషన్‌ శాఖ జరిపిన ప్రీ ఫీజిబిలిటీ సర్వేలో అంచనా వేశాయని, ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే అటవీ భూముల్లో నిర్మాణ పనులకు అనుమతి పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు దరఖాస్తు చేసుకుందని పిటిషనర్లు వివరిం చారు.

దీనికి సంబంధించి రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన పూర్తి వివరాలను ట్రిబ్యునల్‌కు సమర్పించారు. అటవీ భూము ల కోసం అనుమతులకు దరఖాస్తు చేసుకున్న ప్పుడు ఇది సాగునీటి ప్రాజెక్టేనని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొందని వివరిం చారు. అటవీ భూముల బదలాయింపునకు ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తులను పరిశీలించిన ట్రిబ్యునల్‌.. ఈ ప్రాజెక్టు పరిధిలో భారీగా అటవీ భూములు ఉన్నాయ ని గుర్తించింది. అయితే ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టు పరిధిలోకి అటవీ భూములు రావని చెప్పిందని ట్రిబ్యునల్‌ ఆదేశాల ప్రతుల్లో పేర్కొంది. ప్రభుత్వం సమర్పించిన మ్యాప్‌ లను పరిశీలిస్తే మాత్రం ప్రాజెక్టు పరిధిలోకి అటవీ భూములు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోందని ట్రిబ్యు నల్‌ పేర్కొంది. అటవీ భూముల్లో నిర్మాణా లకు పూర్తి స్థాయి అనుమతులు తప్పనిసరి కావడంతో అనుమతులు వచ్చేదాక ఈ ప్రాజెక్టు నిర్మాణంపై స్టే విధిస్తున్నట్టు తెలిపింది.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌