amp pages | Sakshi

16 నుంచి రేషన్‌ షాపుల మూసివేత

Published on Fri, 06/01/2018 - 02:14

పెద్దఅంబర్‌పేట(ఇబ్రహీంపట్నం): రేషన్‌ డీలర్లు గర్జించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను ఆమోదించాలని నిరసన గళం వినిపించారు. ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 16 నుంచి రేషన్‌షాపులను మూసివేయనున్నట్లు రాష్ట్ర రేషన్‌ డీలర్ల ఉమ్మడి కార్య నిర్వహణా సంఘం ప్రతినిధులు ప్రకటించారు. రేషన్‌ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రం గారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేటలో గురువారం రేషన్‌ డీలర్ల గర్జన సభ నిర్వహించారు. సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వేలాది మంది డీలర్లు్ల తరలివచ్చారు.

రేషన్‌ డీలర్లకు ప్రతినెలా రూ.30 వేల గౌరవ వేతనం ఇవ్వాలని, లేని పక్షంలో జూలై 1 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. రేషన్‌ డీలర్ల సమస్యలపై నాలుగేళ్లుగా పౌర సరఫరాల అధికారుల కు వినతిపత్రాలు సమర్పించినా సమస్యలు పరిష్కరించ కుండా కాలయాపన చేస్తున్నారన్నారు. మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలకు, ప్రజలకు మ«ధ్య వారధిగా ఉంటూ ఎన్నో ప్రభు త్వ పథకాలను విజయవంతం చేసినా ప్రభు త్వాలు తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నూతనంగా ప్రవేశపెట్టిన ఈ పాస్‌ విధానానికి తాము వ్యతిరేకం కా దని, అదే సమయంలో తమ సంక్షేమం గురిం చి కూడా ఆలోచించాలన్నారు. కొన్నేళ్లుగా రేషన్‌ డీలర్లు రెండు సంఘాలుగా ఏర్పడడంతో ఐకమత్యం లోపించిందని, ఇదే అదునుగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం రేషన్‌ డీలర్ల తో చెలగాటం ఆడిందని, రెండు సంఘాలు ఒక్కటయ్యాయ ని, ఇక నుంచి ప్రభుత్వ ఆటలు కొనసాగవని అన్నారు. ఈ నెల 15లోపు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రజాపంపిణీ వ్యవస్థ ఒకే విధంగా కొనసాగుతుంటే తెలంగాణలో మాత్రం భిన్నంగా నడుస్తోందన్నారు. మూడు రకాల వస్తువులనే పంపిణీ చేస్తుండగా, వాటిల్లో డీలర్లకు ప్రభుత్వం ఇచ్చే కమీషన్‌ ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. సమ్మెను దృష్టిలో పెట్టుకుని రేషన్‌ డీలర్లు డీడీలను చెల్లించవద్దని సూచించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు, ప్రతినిధులు బత్తుల రమేశ్‌బాబు, మాధవరావు, దాసరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

తీర్మానాలు ఇవీ..
రేషన్‌ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి.  
 రూ.416 కోట్ల కమీషన్‌ బకాయిలను జూలైలో విడుదల చేయాలి.
 డీలర్ల కుటుంబసభ్యులకు హెల్త్‌కార్డులు జారీ చేయాలి.  
ఇళ్లులేనివారికి ఇళ్లు, ఇళ్లస్థలాలు ఇవ్వాలి.  
 ఎలక్ట్రానిక్‌ యంత్రంపై బియ్యం తూకం వేసి సరఫరా చేయాలి.  
 ప్రజలకు అవసరమైన అన్ని సరుకులను రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలి.

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)