amp pages | Sakshi

రబీ యాక్షన్‌ ప్లాన్‌ రెడీ

Published on Sun, 09/30/2018 - 10:02

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: రబీ కాలం ముంచుకొస్తోంది. ఇప్పటికే వ్యవసాయశాఖ ప్రణాళికను ఖరారు చేసింది. గతేడాది రబీసాగును దృష్టిలో పెట్టుకుని వ్యవసాయశాఖ ఈ రబీ సాగు ప్రణా ళికను విడుదల చేసింది. 2018–19లో 69,948 హెక్టార్లలో రైతులు వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందుకోసం సరిపడా సబ్సిడీ విత్తనాలు, ఎరువులను కూడా సిద్ధంగా ఉంచింది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో గతేడాది ఇదే సమయంతో పోలిస్తే.. 22 టీఎంసీల నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఎస్సారెస్పీ నుంచి ఎల్‌ఎండీ ద్వారా జిల్లాలో రబీకి ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిన సాగునీరు ఇచ్చేందుకు కూడా ప్రణాళికను ఇరిగేషన్‌ అధికారులు సిద్ధం చేస్తున్నారు. వచ్చే నవంబర్‌లో రైతులకు మరోమారు ‘రైతుబంధు’ రొక్కం చేతికందనుండగా, ఈసారి రబీ రైతులకు అనుకూలిస్తుందన్న ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయశాఖ రబీ యాక్షన్‌ ప్లాన్‌ ఇదీ..
వ్యవసాయ శాఖ గత రబీ పంటల సాగు విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకుని ఈ రబీ సాగు విస్తీర్ణాన్ని ఖరారు చేసింది. గతేడాది రబీలో 66,198 హెక్టార్లలో వివిధ పంటలు వేయగా. ఈసారి 69,948 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, పెసర తదితరు పంటలు వేస్తారని పేర్కొన్నారు. గత రబీలో 95 శాతం సాగు కాగా, ఈసారి నూటికి నూరు శాతం అవుతుందంటున్నారు. మొత్తం 69,948 హెక్టార్లకు గాను 56,000 హెక్టార్లలో వరి, 10,400 హెక్టార్లలో మొక్కజొన్న, 1,981లలో వేరుశనగ, 249లలో శనగ, 172లలో పెసర, 1,146 హెక్టార్లలో ఇతర పంటలు వేస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ పంటలకు సరిపడా సబ్సిడీ విత్తనాలు, ఎరువులను మార్కెట్‌లో సిద్ధంగా ఉంచినట్లు నివేదికలో వ్యవసాయశాఖ పేర్కొంది. గతేడాది రబీలో 7,184.73 క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు సరఫరా చేస్తే, ఈ ఏడాది 15,261 క్వింటాళ్ల వరి, శనగ, పెసర, వేరుశనగ, మినుములు తదితర రకాల విత్తనాలను సిద్ధం చేశారు. అదేవిధంగా గత రబీలో 50,914 మెట్రిక్‌ టన్నుల ఎరువులను సరఫరా చేయగా, ఈ సారి 59,205 మె.టన్నుల యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, ఎం.ఓ.పి. ఎరువులను అధికారులు మార్కెట్లో సిద్ధంగా ఉంచారు. ఈ మేరకు రబీ కోసం అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను మార్కెట్‌లో సిద్ధంగా ఉంచినట్లు కూడా అధికారులు వెల్లడించారు.
 
ఫసల్‌ బీమాపై విస్తృత ప్రచారం.. విత్తనాల విషయంలో జాగ్రత్త
జిల్లాలో ఈ రబీలో 69,948 హెక్టార్లలో వివిధ పంటలు వేస్తారన్న అంచనా మేరకు అన్ని చర్యలు తీసుకున్నాం. ఈ మేరకు రైతులకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలను మార్కెట్లో సిద్ధంగా ఉంచాం. అయితే.. రైతులు ప్రధానంగా వరి విత్తనాలను ఉత్పత్తి చేసే విషయంలో రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ముందుగానే ఆ కంపెనీలతో విడిగా అగ్రిమెంట్‌ చేయించుకుంటే మేలు. దీర్ఘకాలిక రకాలను కూడా వేయొద్దు. ఫసల్‌ బీమా యోజన కింద రైతులు పంటల బీమా చేయించుకోవాలని కోరుతున్నాం. – వాసిరెడ్డి శ్రీధర్, డీఏవో, కరీంనగర్‌

Videos

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)