amp pages | Sakshi

అత్యాచార నిందితులను శిక్షించాల్సిందే..

Published on Fri, 03/04/2016 - 01:42

కలెక్టరేట్ ఎదుట దళిత,   విద్యార్థి, ప్రజాసంఘాల ధర్నా
 
ముకరంపుర :  వీణవంక మండలం చల్లూరులో దళిత యువతిపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులను ప్రజాకోర్టులో కఠినంగా శిక్షించాలని పలు ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయూలని, సంఘటనకు బాధ్యులైన పోలీసుల ను సస్పెండ్ చేయూలంటూ దళిత, విద్యార్థి, మహిళ, ప్రజాసంఘాల నాయకులు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థారుు వరకూ పోలీసుల నిర్లక్ష్యంతోనే యువతిపై అఘాయిత్యం జరిగిందని ఆరోపించారు. కలెక్టర్, జేసీ మహిళలై ఉండీ.. బాధితురాలికి న్యా యం చేయలేకపోతున్నారని ఆరోపించారు. గ్రామీణ స్థాయిలో షీటీంలను బలోపేతం చేసి నిఘా నిర్వహించాలన్నారు. కళాశాలలు, శిక్షణ కేం ద్రాలు, రద్దీ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు అమర్చి నిఘా పెంచాలన్నారు. బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇప్పించాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరపల్లి సుజాత, బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కనపల్లి గణేశ్, మూల్‌నివాసి సంఘ్ రాష్ట్ర కార్యదర్శి మార్వాడి సుదర్శన్, ఆదివాసీ హక్కుల పోరాట కమిటీ జిల్లా ప్రధా న కార్యదర్శి గుర్రాల రవీందర్, కుల నిర్మూల న పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అభినవ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడు జన్ను జయరాజ్, తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసాల సంపత్, చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు శోభారాణి, పౌరహక్కు ల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాదన కుమారస్వామి, జిల్లా అధ్యక్షుడు జిందం ప్రసా ద్, ఉపాధ్యక్షురాలు పుల్ల సుచరిత, ప్రైవేట్ రిజర్వేషన్ సాధన సమితి అధ్యక్షుడు సుంకరి సంపత్, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్, టీవీవీ జిల్లా అధ్యక్షుడు మహేశ్, తెలంగాణ ప్రజాప్రంట్ నాయకులు వీరగోని పెంటయ్య, సీపీఐ నాయకుడు పైడిపల్లి రాజు, తెలంగాణ జనసమితి జిల్లా కన్వీనర్ సి.రమేశ్, తెలంగాణ బహుజన కార్మిక సంఘం నాయకు లు నగునూరి ఎల్లయ్య, పోలు శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొయ్యల సత్యంలు పాల్గొన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)