amp pages | Sakshi

కేంద్రంపై ఒత్తిడి తెండి

Published on Wed, 07/01/2015 - 01:28

♦ తమ సమస్యలను పరిష్కరించాలని జగన్‌కు పొగాకు రైతుల వినతి
♦ కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళతామని ప్రతిపక్షనేత హామీ
 
 
 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పొగాకు రైతులను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పలువురు రైతులు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తలారి వెంకటరావు నేతృత్వంలో పెద్ద సంఖ్యలో రైతులు మంగళవారం  పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ను కలిసి తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ ఎంపీల ద్వారా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో 50 వేల మందికి పైగా రైతులు పొగాకు పండిస్తున్నారని, గిట్టుబాటు ధర లేక వారంతా నష్టాల ఊబిలో కూరుకు పోతున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రైతులకు లాభసాటిగా ఉండే ప్రత్యామ్నాయ పంటలు లేకపోవడం పొగాకు రైతులకు  ఆశనిపాతంగా మారిందన్నారు. ప్రభుత్వ నిరంకుశ, నిర్లక్ష్య వైఖరితో ఏదో రకంగా పొగాకు సాగును నిర్మూలించేందుకు రహస్య యత్నాలు జరుగుతున్నాయని వినతిపత్రంలో వాపోయారు. ఖైనీ, గుట్కా, పాన్‌పరాగ్, బీడీ వంటి వాటిని నియంత్రించకుండా కేవలం ఒక్క సిగరెట్లపైనే 30 నుంచి 70 శాతం పన్ను పెంచేశారన్నారు.

పొగాకు ఎగుమతి కంపెనీలకు రాయితీలు ఇవ్వక వారిని నష్టాలకు గురి చేస్తున్నారని వివరించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో పొగాకు కిలో ధర రూ. 170 ఉండగా ప్రస్తుతం రూ. 90 నుంచి రూ. 130 లోపు ఉంటోందని రైతులు వాపోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ రైతులకు అండగా నిలబడాలని కోరారు. దీనిపై జగన్ స్పందిస్తూ.. పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రుతో ఈ అంశంపై సంప్రదింపులు జరిపేలా కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. జగన్‌ను కలిసిన రైతు ప్రతినిధుల్లో కె.రాంబాబు, ఎస్.ఎస్.వి.కె.ఈశ్వర్‌రెడ్డి, ఎస్.జి.జగదీశ్వర్‌రెడ్డి, పి.సుభాష్‌చంద్ర, పి.ప్రసాద్, చవల సుబ్రహ్మణ్యం, కంకట గాంధీ తదితరులున్నారు.

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)