More

అవినీతి అధికారులపై కఠిన చర్యలు : మంత్రి పోచారం

4 Mar, 2015 15:03 IST
అవినీతి అధికారులపై కఠిన చర్యలు : మంత్రి పోచారం

అశ్వారావుపేట: ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో ఆయిల్‌ఫెడ్‌కు చెందిన పామాయిల్ ఫ్యాక్టరీలో అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. పామాయిల్ ఫ్యాక్టరీలో బుధవారం రైతులతో నిర్వహించిన సమావేశంలోమంత్రులు పోచారం,  తుమ్మల నాగేశ్వరరావు లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ... పామాయిల్ రికవరీ 20 శాతానికి తక్కువ కాకుండా వచ్చేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. గతంలో ఫ్యాక్టరీలో అధికారులు చేసిన అవినీతిపై మాట్లాడుతూ... ప్రత్యేక పైపులైన్ ద్వారా పామాయిల్ మళ్లించి రైతులను దోచుకోవడం తీవ్రమైన నేరంగా పేర్కొన్నారు.

 తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేస్తే సరిపోదన్నారు. మరెవరూ అలాంటి తప్పు చేయకుండా భయపడే రీతిలో చర్యలు తీసుకోవాలని ఆయిల్‌ఫెడ్ జాయింట్ డెరైక్టర్ అచ్యుతరావుకు మంత్రి పోచారం సూచించారు. పామాయిల్ రైతులకు మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పారు.
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

వైఎస్సార్‌ స్ఫూర్తితో పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర చేపట్టా: భట్టి

కామారెడ్డి రూపురేఖలు మారుస్తా: కేసీఆర్‌

రాజకీయం సినిమా వరకేనా? ఎన్నికల్లో పోటీ చేయరా?

KTR Accident: బీఆర్‌ఎస్‌ ర్యాలీలో అపశ్రుతి.. కేటీఆర్‌కు తప్పిన ముప్పు

ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య రాళ్లదాడి