amp pages | Sakshi

ఎన్నికల హామీల అమలు బాధ్యత పార్టీలదే

Published on Wed, 11/07/2018 - 02:32

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు విచక్షణారహితంగా చేస్తున్న హామీలకు ఆయా పార్టీలను బాధ్యులను చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వాజ్యం (పిల్‌) దాఖలైంది. సుబ్రమణ్యం బాలాజీ–తమిళనాడు ప్రభుత్వాల మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల్ని అమలుకు ఉత్తర్వులు జారీ చేయాలని చార్టర్డ్‌æ అకౌంటెంట్‌ ఎం.నారాయణాచార్యులు దాఖలు చేసిన పిల్‌లో హైకోర్టును అభ్యర్థించారు. అధికారమే పరమావధిగా పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసే హామీలు ఇస్తున్నాయని, పార్టీలిచ్చే హామీలపై పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే వరకూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. ఈ పిల్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని మంగళవా రం న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనాన్ని కోరారు.

అయితే ఇప్పటికిప్పుడే విచారణ చేపట్టలేమని, గురువారం (8న) విచారించే అంశాన్ని ప్రధాన న్యాయమూర్తితో కూడి న ధర్మాసనం నిర్ణయం తీసుకుంటుందని న్యాయ మూర్తులు తెలిపారు. ‘హామీల అమలుకు ఆదర్శ ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) ఉంది. మేనిఫెస్టో అమలుకు ఎంసీసీని ఎవరూ అమలు చేయడం లేదు. అధికారమే పరమావధిగా పదవీ వ్యామోహంతో పార్టీలు ఇష్టారీతిన హామీలు ఇచ్చేస్తున్నాయి. ఆర్థికంగా ప్రభుత్వ పరిస్థితుల గురించి కనీసం ఆలోచన చేయడం లేదు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకా రం అమలు కాని హామీలు ఇవ్వడానికి వీల్లేదు. ఎంసీసీ అమలుకు పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పా టు చేసిన తర్వాతే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి...’అని పిల్‌లో కోరారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌