amp pages | Sakshi

ఆసరా అందేనా..!

Published on Sat, 11/22/2014 - 02:48

మంచిర్యాల రూరల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆసరా’ (నూతన పింఛన్) పథకం అభాసుపాలవుతోంది. జిల్లా లో అర్హుల జాబితా ఎంపికపై ఇంకా కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు దరఖా స్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించే ప్రక్రి య పూర్తి కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

కొందరి పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసినా.. అర్హులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదు. దీంతో అధికారులు పునఃపరిశీలన చేపడుతున్నారు. ఫలితంగా అర్హుల జాబితాలో పేర్లు ఉన్న వారికి సైతం పింఛన్లు అందడం లేదు. దీంతో ఇన్నాళ్లు పింఛన్ తీసుకుని.. ఇప్పుడు రాదేమోనని అర్హులు కార్యాలయాల వద్ద ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

 అర్హుల జాబితాపై స్పష్టత కరువు
 సామాజిక పింఛన్ల కోసం జిల్లాలో 3.38 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 3వ తేదీ నుంచి 7 వరకు కేవలం 2.01 లక్షల మంది అర్హులైన దరఖాస్తుదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. పింఛన్ల పంపిణీని 8వ తేదీ నుంచి ప్రారంభించగా.. అర్హుల జాబితాలో స్పష్టత లేకుండాపోయింది. ఇంకా జిల్లాలో ఎంత మంది అర్హులు ఉన్నారన్న విషయాన్ని అధికారులు తేల్చలేకపోతున్నారు.

గతంలో 2.60 లక్షల మంది పింఛన్లు పొందగా.. ఇప్పటి వరకు అధికారులు 2.11 లక్షల మందినే అర్హులుగా గుర్తించారు. అర్హుల గుర్తింపు కోసం అధికారులు మరోసారి పూర్తి విచారణ చేపడుతున్నా, ఎంపికలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తమకు పింఛన్లు వస్తాయా? రావా? అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ఏయే పింఛన్ల కోసం ఎంత మంది అర్హులుగా ఉన్నారనే విషయాన్నీ అధికార యంత్రాంగం తేల్చలేకపోతోంది.

 తప్పుల తడకగా జాబితాలు..
 ప్రతినెలా మొదటి వారంలోనే పింఛన్ అందుకునే లబ్ధిదారులు ఈనెలలో పెరిగిన పింఛన్లు గానీ.. పాత పింఛన్లు గానీ ఇంతవరకూ తీసుకోలేదు. ఈ నెల 8వ తేదీన పింఛన్ల అర్హుల జాబితాలను గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో అందుబాటులోకి తెచ్చారు. అయితే.. జాబితాలో తమ పేర్లు గల్లంతయ్యాయని, తమ పింఛన్ కేటగిరీ మారిందని, ఒకరికి బదులుగా మరో పేరు నమోదైందని తెలుసుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కాకుండా వారి కుటుంబ సభ్యుల్లోని వారికి మంజూరు చేశారు. మరికొన్ని చోట్ల వికలాంగుల నెల పిం ఛన్ రూ.1500 కాగా, వారికి వృద్ధాప్య, వితం తు పింఛన్‌కు అర్హులుగా పేర్కొన్నారు. దీంతో వీరికి నెల పింఛన్ రూ.వెయ్యి వస్తే మిగతా రూ.500 నష్టపోవాల్సిందే. అర్హుల విషయంలో సైతం ప్రభుత్వం ముందు ఒక విధంగా, తరువాత మరో విధంగా ఆదేశాలు జారీ చేస్తుండడంతో మరింత గందరగోళం నెలకొంది.

 పునఃపరిశీలనలో మిగిలేవి ఎన్నో..
 ఆన్‌లైన్‌లో నమోదు చేసిన అర్హులైన పింఛన్ దరఖాస్తులను జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అర్హులుగా నమోదైన వారి వివరాలను జిల్లా ఉన్నతాధికారులు కుటుంబ సర్వే, గతంలో పింఛన్ తీసుకున్న వారి వివరాలను పరిశీలిస్తున్నారు. అనర్హత ఉన్న వారి పేర్లను నాన్‌ఎలిజిబుల్‌గా నమోదు చేసి, ఆయా వివరాలను మండల పరిషత్ కార్యాలయాలకు పంపించి, మరోసారి పరిశీలించిన తరువాతే వారికి పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశిస్తున్నారు.

ఇందుకోసం ప్రతి మండలానికి ఎన్‌ఐసీ సర్వర్‌లో లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను అందజేశారు. కుటుంబ సర్వే సమయంలో కుటుంబ వివరాల నమోదులో, కంప్యూటరీకరణలో జరిగిన పొరపాట్లు కూడా పింఛన్ అర్హుల ఎంపికకు అడ్డంకిగా మారాయి. ఇన్నాళ్లు కుటుంబ సర్వేలో నమోదైన వివరాల ప్రకారమే పింఛన్ లబ్ధిదారుల వివరాలను సరిపోల్చడంతో దరఖాస్తులపై అన ర్హత వేటు పడుతున్నాయి. కుటుంబ సర్వేలో పేర్లు, వయస్సు, ఆధార్ నంబరు, సదరన్ క్యాంపు ఐడీ నంబర్లు తప్పుగా నమోదు కావడంతో, పింఛన్ దరఖాస్తుల్లోని వివరాలు సరిగా లేక అనర్హతకు గురైనట్లు అధికారులు గుర్తించారు.

ఇన్నాళ్లు కుటుంబసర్వే వివరాలను మార్పు చేసే అవకాశం లేకపోవడంతోనే పింఛన్ దరఖాస్తులు అనర్హతకు గురవుతుండడంతో, ఆయా వివరాలను మరోసారి సర్వే చేసి ఎడిట్ చేసుకునేందుకు జిల్లా అధికారులకు అనుమతిని ఇవ్వడంతో, అధికారులు కొంత ఊరట చెందారు. ఈ నెల 30వ తేదీలోగా పింఛన్లలో ఎంత మంది అర్హులు, అనర్హులనే పూర్తిస్థాయి జాబితాల కొలిక్కిరానుంది. ఈ ప్రక్రియ ఈనెలాఖరు వరకు పూర్తిచేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినా.. పూర్తయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 2011 ప్రకారం జిల్లా జనాభా 7.73 లక్షలు
 సమగ్ర సర్వేలో కుటుంబాల సంఖ్య 8.32 లక్షలు
 గతంలో పింఛన్‌దారులు 2.60 లక్షలు
 పింఛన్ కోసం వచ్చిన దరఖాస్తులు 3.38 లక్షలు
 ఇప్పటివరకు అర్హులుగా గుర్తించినవి 2.11 లక్షలు

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)