amp pages | Sakshi

దిగొచ్చిన ఉల్లి!

Published on Thu, 04/12/2018 - 11:33

సాక్షి, సిటీబ్యూరో: కొన్ని నెలలుగా వినియోగదారులను కన్నీళ్లు పెట్టించిన ఉల్లి ధరలు బుధవారం భారీగా తగ్గుముఖం పట్టాయి. హోల్‌సేల్‌గా కిలో రూ.3, రిటైల్‌గా రూ.7 పలికాయి. ఈ ఏడాది ఇదే కనిష్ట ధర అని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఉల్లి పంట నగరంలోని మలక్‌పేట్‌ మార్కెట్‌కు భారీగా దిగుమతి కావడంతో తక్కువ ధర పలికింది.   

దిగుమతుల పెరుగుదలే కారణం..  
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మలక్‌పేట్‌ మార్కెట్‌కు నిత్యం దాదాపు వెయ్యి టన్నుల ఉల్లి దిగుమతి అవుతోంది. ప్రస్తుతం మలక్‌పేట్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌కు తెలుగు రాష్ట్రాల్లోని మెదక్, తాండూరు, మహబూబ్‌నగర్, కర్నూలు, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాలనుంచి ఉల్లి దిగుమతులు పెరిగాయి. దీంతో హోల్‌సేల్‌గా కిలో ఉల్లి రూ.3కు చేరింది. వారం పది రోజుల క్రితం హోల్‌సేల్‌ మార్కెట్‌లో క్వింటా లు ఉల్లి రూ.800–1000 వరకు ఉండేది. దీం తో రిటైల్‌ మార్కెట్‌లో కిలో రూ.15– 20 పలి కింది. ప్రస్తుతం కొత్త పంట వస్తుండడంతో ధరలు భారీగా తగ్గాయి. ఫస్టు క్వాలిటీ ఉల్లి కిలోకు రూ.7 ఉండగా, మధ్య రకం క్వాలిటీ రూ.5గా ఉంది. దీంతో రిటైల్‌ మార్కెట్‌లో ఒకే సారి సాధారణ ఉల్లి ధరలు పడిపోయాయి.  

భారీగా కొత్త ఉల్లి..   
తాండూరు, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డితో పాటు కర్ణా టక, మహారాష్ట్ర ల నుంచి ఎక్కువ మొత్తంలో కొత్త ఉల్లి దిగుమతి అవుతోంది. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. ఏజెంట్లు  అక్రమాలకు పాల్పడితే రైతులు ఫిర్యాదు చేయాలి. అతిత్వరలో ట్రోల్‌ ఫ్రీ నంబర్‌ ప్రారంభిస్తున్నాం.     – జె.అనంతయ్య, సెలక్షన్‌ గ్రేడ్‌–1కార్యదర్శి, హైదరాబాద్‌ మార్కెట్‌ సొసైటీ

Videos

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)