amp pages | Sakshi

వైఎస్‌ఆర్‌సీపీలో వంద కుటుంబాలు చేరిక

Published on Fri, 04/24/2015 - 02:50

జుచింతకాని : మండలంలోని గాంధీనగర్ కాలనీలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నుంచి సుమారు వంద కుటుంబాల వారు గురువారం వైఎస్సార్‌సీపీ నాయకులు బూరుగడ్డ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని అన్నారు.
 
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మండలంలోని గాంధీనగర్ కాలనీలో రూ. 3లక్షలు, చినమండవలో రూ. 3లక్షలు ఎంపీ ల్యాడ్స్‌తో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయూ గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. తెలంగా ణ వస్తే బతుకులు బాగుపడతాయని ప్రజలు కలగన్నారని, బం గారు తెలంగాణ సాధిస్తారనే ఆశతో ప్రజలు టీఆర్‌ఎస్‌కు అధికా రం అప్పగిస్తే వారు పట్టించుకోవడం లేదని అన్నారు. అధికారంలోకి రాకముందు ప్రజలకు ఎన్నో వాగ్ధానాలను ఇచ్చిన కేసీఆర్ ఏడాది గడిచినా ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు.

వాగ్ధానాలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన పార్టీ ఆధ్వర్యంలో పోరాడుతామని అన్నారు. కాపుసారా వల్ల గ్రామాల్లో ఎన్నో కు టుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, రాష్ట్రంలో సారా ని యంత్రణకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా తాను మండలంలో ని పలు గ్రామాలకు మొదటి విడతగా ఎంపీ ల్యాడ్స్ నుంచి సీసీ రోడ్లు మంజూరు చేశానని తెలిపారు. రెండవ విడతగా మరికొన్ని గ్రామాలకు సీసీ రోడ్లు మంజూరు చేసి అభివృద్ధికి పాటుపడతానని  తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ దాసరి సామ్రాజ్యం, ఎంపీడీఓ నవాబ్‌పాషా, తహశీల్దార్ రాజశేఖర్, గ్రామసర్పంచ్‌లు షేక్ బోదల్‌బీ, మరీదు అచ్చమ్మ, పంచాయతీరాజ్ ఏఈ హనుమంతురావు, ఎంపీటీసీ సభ్యులు బూరుగడ్డ జ్యోతి, సోంపాక రమణమ్మ, వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ సాధు రమేష్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఎండీ ముస్తఫా, మధిర నియోజకవర్గ సమన్వయకమిటీ కన్వీనర్  తూమాటి నర్సిరెడ్డి, మధిర, చింతకాని మండల క న్వీనర్లు యన్నం కోటేశ్వరరావు, ఎర్రుపాలెం జెడ్పీటీసీ అంకసాల శ్రీనివాసరావు, కొప్పుల నాగేశ్వరరావు, మండల నాయకులు తూమాటి అనంతరెడ్డి, చెవుల వెంకయ్య, కన్నెబోయిన సీతారామయ్య, వాకా వీరారెడ్డి, నెల్లూరి రమేష్,యల్లంపల్లి సతీష్, అడపా వెంకటరామనర్సయ్య పాల్గొన్నారు.
 
నేడు జిల్లాలో ఎంపీ పొంగులేటి పర్యటన


సాక్షి, ఖమ్మం : వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు గురువారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. ఉదయం 7 గంటలకు భద్రాచలంలో సీతారామచంద్రస్వామిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి కారేపల్లి మండలంలో పర్యటించనున్నారు.

విశ్వనాథపల్లి, బాద్‌మల్లయ్యగూడెం, కారేపల్లిలో ఎంపీ ల్యాడ్స్‌తో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఎంపీపీ ఇంట్లో జరిగే శుభకార్యంలో పాల్గొననున్నారు. సాయంత్రం దమ్మపేట మండలంలో నాగువల్లి, మొండివర్రి గ్రామాల్లో ఎంపీ ల్యాడ్స్‌తో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే దమ్మపేటలో లబ్ధిదారులకు గ్యాస్ స్టౌలు పంపిణీ చేయనున్నారు.

Videos

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌