amp pages | Sakshi

జిల్లాలో వడదెబ్బ మరణాలు లేవు

Published on Tue, 05/26/2015 - 05:59

డీఎంహెచ్‌ఓ సాంబశివరావు
ఎంజీఎం :
జిల్లాలో ఎండల ఉధృతి కారణంగా పూర్తిస్థాయి లో వడదెబ్బతోనే ఎవరూ మృతిచెందినట్లు ధ్రువీకరణ కాలేదని  జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి బొజబోయిన సాంబశివరావు పేర్కొన్నారు. ప్రజలు వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వివరించారు. ఫిబ్రవరి నుంచి మే మొదటి వారం వరకు 66 మంది వడదెబ్బతో మృతిచెంది నట్లు వివిధ ప్రసార సాధనాల ద్వారా తెలిసిందన్నారు. వడదెబ్బ మరణాన్ని ధ్రువీకరించేందుకు మెడికల్ ఆఫీసర్‌తోపాటు తహసీల్దార్, ఎస్సై పంచనామా చేయూల్సి ఉంటుందని తెలిపారు. ఆ కమిటీ ద్వారా ఇంతవరకు వడదెబ్బగా ధ్రువీకరించిన కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదన్నారు మే రెండో  వారం నుంచి శనివారం వరకు సుమారు 88 మంది వడదెబ్బతో మృతిచెందినట్లు ప్రసార సాధనాల ద్వారా తెలిసిందన్నారు. వాటిపై కూడా ఆయా పీహెచ్‌సీల పరిధిలో కమిటీలు వడదెబ్బతో జరిగిన మరణాలో కాదో ధ్రువీకరించడం జరుగుతుందన్నారు. వడదెబ్బతో మృతిచెందితే అపద్బాంధు పథకం ద్వారా సాయం అందుతుందన్నారు.

వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
వదడెబ్బ తగలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్ సాంబశివరావు సూచించారు. నీరు తక్కువగా తీసుకుని, మత్తు పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వడదెబ్బకు గురయ్యే ప్రమాదముందన్నారు. ఎండలో విశ్రాం తి లేకుండా ఎక్కువగా పనిచేయడం వల్ల, ఆహారం సరిగా తీసుకకోపోవడం వల్ల వడదెబ్బ బారినపడే ప్రమాదముందన్నారు. ఎండలో తప్పనిసరి వెళ్లాల్సి వస్తే టోపీలు ధరించాలని, నీరు, ద్రవపదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలన్నారు. విలేకరుల సమావేశంలో డీఐఓ రామకృష్ణ, వైద్యులు సారంగపాణి, రామ్మోహన్‌రావు, స్వరూపరాణి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)