amp pages | Sakshi

కీళ్ల నొప్పులు.. టోకెన్‌ తిప్పలు..! 

Published on Fri, 05/10/2019 - 01:41

కీళ్లనొప్పులతో బాధపడుతున్న రోగులకు నిమ్స్‌లో నిలువుకాళ్ల జపం తప్పట్లేదు. ఓపీ టోకెన్‌ కోసం అర్ధరాత్రి 2 గంటలకే ఆస్పత్రికి చేరుకుని క్యూలైన్‌లో నిలబడాల్సి వస్తోంది. నొప్పుల బాధను దిగమింగుకుని గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడ్డా.. తీరా ఓపీ వేళకు నిరాశే మిగులుతోంది. రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. 
సాక్షి, హైదరాబాద్‌

దేశంలోనే ప్రత్యేక గుర్తింపు

నిమ్స్‌ ఆస్పత్రికి కీళ్ల నొప్పులతో బాధపడే రోగులు రోజుకు దాదాపు 150 మందికిపైగా వస్తుంటారు. అయితే 60 మంది రోగులకు మించి వైద్య సేవలు అందించలేని పరిస్థితి అక్కడ నెలకొంది. కీళ్లనొప్పుల బాధితుల కోసం 1994లో ప్రత్యేకంగా రుమటాలజీ ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రొఫెసర్‌ జి.నరసింహులు ఆస్ట్రేలియాకు వెళ్లి ప్రత్యేక శిక్షణ పొంది వచ్చారు. అప్పటివరకు ప్రైవేటులో ఎక్కడా రుమటాలజీ వైద్యుల్లేకపోవడంతో ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. దీంతో 2001లో రుమటాలజీ విభాగం కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. అయితే రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడంతో మరింత మంది స్పెషలిస్టులను తయారు చేసేందుకు 2005లో డీఎం రుమటాలజీ కోర్సు ఏర్పాటు చేయగా, 2007లో దీనికి గుర్తింపు లభించింది. అనేక పరిశోధనలు, మెరుగైన వైద్యసేవలు, అత్యుత్తమ వైద్యవిద్య బోధనతో దేశంలోనే ఓ వెలుగు వెలిచిన రుమటాలజీ విభాగం ప్రస్తుతం కనీస వైద్యసేవలు అందించలేకపోతోంది. 

ఒక్కొక్కరూ వీడిపోవడంతో 
ప్రొఫెసర్‌ నరసింహులు కూడా పదవీ విరమణ చేసిన తర్వాత రోగుల నిష్పత్తికి తగ్గట్లు ఆ విభాగాన్ని అభివృద్ధి చేయకపోవడం, అంతర్గత కుమ్ములాటలు, నిమ్స్‌తో పోలిస్తే కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వేతనాలు రెట్టింపు స్థాయిలో ఉండటంతో వైద్యులు ఒక్కొక్కరుగా ఆస్పత్రిని వీడారు. ఇప్పటివరకు ఇక్కడ 45 మంది వరకు రుమటాలజీ సూపర్‌ స్పెషాలిటీ కోర్సు పూర్తిచేయగా, వీరి సేవలను వినియోగించుకోవడంలో పాలక మండలి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఉస్మానియా, గాంధీ సహా జిల్లా కేంద్రాల్లోనూ రుమటాలజీ వైద్యుల్లేకపోవడం, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఈ చికిత్సలు ఖరీదు కావడం, కార్పొరేట్‌ ఆస్పత్రులతో పోలిస్తే నిమ్స్‌లో మరింత మెరుగైన వైద్యం అందుతుందనే నమ్మకంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. 2011 వరకు ఐదుగురు ఫ్యాకల్టీ వైద్యులు ఉండేవారు. ప్రస్తుతం ఇద్దరికి పడిపోయింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ వేళలు కొనసాగుతుండటం, రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడంతో రోజుకు సగటున 60 మందికి మించి చూడలేకపోతున్నారు. ఎలాగైనా ఇక్కడ వైద్యం చేయించుకోవాలనే ఆశతో అర్ధరాత్రి రెండు గంటలకే ఓపీ కౌంటర్‌కు చేరుకుంటున్నారు. తీరా ఉదయం టోకెన్లు దొరక్క తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. 

ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్లే..  
కీళ్లవాతం బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యుల్లేరు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ సహా కింగ్‌జార్జ్, కోల్‌కతా, చండీగఢ్, వేల్లూర్, ముంబై, నిమ్స్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్ల నుంచి ఏటా 45 మంది మాత్రమే సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు బయటికి వస్తున్నారు. రుమటాలజీలో సూపర్‌ స్పెషాలిటీ పూర్తి చేసిన వైద్యులకు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో భారీ డిమాండ్‌ ఉంది. వేతనం కూడా నిమ్స్‌లో కన్నా రెట్టింపు ఉంది. పాలకులు ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడం, రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడం వల్ల నిమ్స్‌ సహా ఇతర ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న కొందరిపైనే భారం పడుతోంది. 
–ప్రొఫెసర్‌ జి.నరసింహులు, విశ్రాంత వైద్యుడు, నిమ్స్‌ 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)