amp pages | Sakshi

అయ్యా... మా కొడుకుల జాడ చెప్పుండ్రి

Published on Fri, 07/31/2015 - 02:46

 మేం కాటికి దగ్గర అవుతున్నం... కుక్కిన పడితే చూసుకునే దిక్కులేదు... ఇరవై ఏడేండ్లుగా కన్న కొడుకుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నం... వాళ్లు ఏమైండ్లో ఇంతవరకు జాడ లేదు... అసలు మా బిడ్డలు బతికున్నరా లేదా... అదన్నా చెప్పుండ్రి... ఈ తల్లులు కన్నీళ్లు తుడువుండ్రి బాంచెన్...’’ ఇది కాటారం మండలం గుమ్మాళ్లపల్లికి చెందిన చల్ల రాజుబారుు, గోసికె లచ్చక్కల అవేదన. పంచాయితీ కోసమని ఇంటి నుంచి వెళ్లిన కొడుకులు ఇగ వస్తరు... అగ వస్తరు అని 27 ఏళ్లుగా ఎదురుచూస్తున్న తల్లుల వేదన. తమ కొడుకుల ఫొటోలు చూపుతూ గురువారం విలేకరుల ఎదుట ఆ ఇద్దరు వృద్ధులు తమ గోడును వెల్లబోసుకున్నారు. వారు చెప్పిన వివరాలు...   
 
 కాటారం : 1989, జనవరి 12న చల్ల రాజుబాయి కుమారుడు చల్ల బాపురెడ్డి(22), గోసికె లచ్చక్క కుమారు డు గోసికె రాజయ్య(23), వీరాపూర్ కు చెందిన బొమ్మ జనార్దన్‌రెడ్డి(23) కలిసి మహదేవపూర్ మండలం సూ రారంకు పంచాయితీ నిమిత్తం ఒకే ద్విచక్ర వాహనంపై వెళ్లారు. పంచాయితీ పూర్తయిన అనంతరం తిరుగు ప్రయాణంలో సూరారం సమీపంలోని కొంగలవాగు వద్ద పోలీసులు ఈ ముగ్గిరిని అపహరించుకుపోయినట్లు ప్రచారం జరిగింది. కానీ తమకు ఎ లాంటి సమాచారం ఇవ్వలేదని రాజుబాయి, లచ్చక్క తెలిపా రు. రోజులు గడిచినా తమ కొడుకుల ఆచూకీ తెలియకపోవడంతో గ్రామస్తులు, బంధువుల సహకారంతో మహదేవపూర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. తమ కొడుకుల ఆచూకీ తెలుపాలంటూ పోలీసు అధికారుల కాళ్లావేళ్లా ప్రాధేయపడ్డా రు. పోలీసులు తమకు తెలియదని చెప్పడంతో మానవహక్కు ల సంఘాన్ని ఆశ్రయించారు. మానవ హక్కుల నేతలు వరవరరావు, బాలగోపాల్‌లను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నామన్నారు. వారి సహకారంతో హైకోర్టులో కేసు సైతం వేశారు. అరుునా ఫలితం దక్కలేదని వారు వాపోయూరు.
 
 ఇదిలా ఉండగా... జనవరి 18న మహాముత్తారం మండలం పెగడపల్లి సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తమ కుమారులు చనిపోయారని పోలీసులు ప్రకటించినట్లు అప్పట్లో పేపర్లలో వచ్చిందని అంటుంటే విన్నాం.. కానీ మాకు శవాలను కూడా చూపించలేదని వారు తెలిపారు. అది వాస్తవమా కాదా అని తేల్చుకోలేకపోతున్నామంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ కుమారులు ఎన్‌కౌంటర్‌లో చనిపోతే తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని, మృతదేహాలను ఎందుకు అప్పగించలేదని వారు ప్రశ్నిస్తున్నారు. వారు మృతి చెందారా లేక బతికి ఉన్నారా అన్న సంశయంలో కాలం వెల్లదీస్తున్నామని ఆ తల్లులు కన్నీటిపర్యంతమయ్యూరు. ఒకవేళ మృతి చెందితే మరణ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వమన్నా అధికారులు తిప్పించుకున్నారే తప్ప ఇవ్వలేదని పేర్కొన్నారు. వృద్ధాప్యంలో దిక్కుమొక్కు లేక ఉన్నామని, తమను చూసుకునేవారు లేరంటూ బోరున విలపించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ కుమారుల విషయంపై వివరణ ఇవ్వాలని, ప్రభుత్వ పరంగా తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.
 
 ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు పోలీసుల రికార్డుల్లో..
 బాపురెడ్డి, రాజయ్య పీపుల్స్‌వార్ పార్టీ సానుభూతిపరులుగా వ్యవహరించారని, వీరు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారని అప్పటి పోలీసులు ప్రకటించి రికార్డుల్లో పేర్కొన్నారు. కానీ జనార్దన్‌రెడ్డికి సంబంధించిన ఎలాంటి వివరాలను పోలీసు లు తెలియపర్చలేదు. ఎన్‌కౌంటర్‌లో బాపురెడ్డి, రాజయ్య మృతి చెందారని తమకు ఎలాంటి ఆనవాళ్లు కానీ, సమాచా రం కానీ పోలీసులు ఇవ్వలేదని, తమ కుమారులే మృతి చెం దారని ఎలా తెలుస్తుందని వారి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. వీరు హైకోర్టుతో పాటు మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో అప్పట్లో కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిర్వహించిన అధికారులు వివరాలు సేకరించారు. పెగడపల్లి గ్రామానికి వెళ్లి సాక్షుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు పోలీసులు రికార్డులు సమర్పించినట్లు సమాచారం. ఇప్పటి వరకు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బయట కు రాలేదని తెలిసింది. ఓ పక్క ఎన్‌కౌంటర్‌లోనే బాపురెడ్డి, రా జయ్య మృతి చెందారని పోలీసు రికార్డులు తెలుపుతున్పప్పటికీ మృతి చెందిన వారు తమ వారని నిర్ధారణకు రాలేకపోతున్నామని వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 దుర్భర స్థితిలో వృద్ధులు
 బాపురెడ్డి తల్లి రాజుబాయి, రాజయ్య తల్లి లచ్చక్క, జనార్దన్‌రెడ్డి కుటుంబసభ్యులు దుర్భర స్థితిని అనుభవిస్తున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు జనార్దన్‌రెడ్డికి వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉండగా, మిగతా ఇద్దరికి వివాహం కాలేదు. ప్రస్తుతం రాజుబాయి, లచ్చక్కలకు పూట గడవడమే కష్టంగా ఉంది. పెన్షన్‌పై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వీరిద్దరికి ఇద్దరు కుమారులు ఉన్నప్పటికీ ఆలనాపాలనా కరువైంది. కనీసం తమ కుమారులు మృతి చెందారని ధ్రువీకరణ పత్రం అయినా ఇచ్చివుంటే ఎల్‌ఐసీ లాంటి పాలసీలు వర్తించి తమకు ఆధారంగా ఉండేవంటున్నారు. కాగా ఆచూకీ తెలియకుండా పోరుున బొమ్మ జనార్దన్‌రెడ్డి సతీమణి ప్రేమలత ఇటీవల ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీని కలిసి తన గోడును వెల్లబోసుకోగా ప్రభుత్వం ద్వారా రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరైంది. ఈనెల 29న చెక్కును అందజేశారు. తన కుమారునికి ఉద్యోగం ఇవ్వడానికి సీఎం హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.  
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌