amp pages | Sakshi

చట్టసవరణ తర్వాతే ఎన్నికలు

Published on Mon, 03/04/2019 - 02:01

సాక్షి, హైదరాబాద్‌: పురపాలికల చట్టాల సవరణ తర్వాతే రాష్ట్రంలో మునిసిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. వార్డులు/డివిజన్ల పునర్విభజనకు ప్రస్తుత నిబంధనలు అడ్డుగా మారడంతో చట్ట సవరణ అనివార్యమైంది. రాష్ట్ర పురపాలక శాఖ చట్టాలకు సవరణలు చేయడం ద్వారా గతేడాది మార్చిలో రాష్ట్రంలో 75 కొత్త మునిసిపాలిటీలను ఏర్పాటు చేయడంతోపాటు 135కుపైగా శివారు గ్రామాలను 37 పాత మునిసిపాలిటీలు, 5 మునిసిపల్‌ కార్పొరేషన్లలో విలీనం చేశారు. కొత్తగా ఏర్పడే మునిసిపాలిటీల్లో ఉండాల్సిన వార్డుల సంఖ్యతోపాటు పాత మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్లలో విలీనమైన ప్రాంతాలు ఏ వార్డు/డివిజన్ల పరిధిలోకి వస్తాయన్న విషయాన్ని సైతం ప్రభుత్వం అప్పట్లో జారీ చేసిన చట్ట సవరణ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఓటర్ల సంఖ్య సమంగా ఉండేలా వార్డులు/డివిజన్ల విభజన జరపాలని నిబంధనలుండగా, శివారు గ్రామాల విలీనంతో కొన్ని వార్డులు/డివిజన్లలో ఓటర్ల సంఖ్య అసాధారణ రీతిలో పెరిగిపోయింది.

అదేవిధంగా కొత్తగా ఏర్పడిన కొన్ని మునిసిపాలిటీల్లో సైతం వార్డుల పునర్విభజనలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయి. దీంతో వార్డుల పునర్విభజనకు అడ్డంకులు తొలగించేందుకు పురపాలక శాఖ చట్టాలకు మరోసారి సవరణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలి స్తోంది. రాష్ట్రంలో మొత్తం 143 మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు ఉండగా 6 మునిసిపల్‌ కార్పొరేషన్లు మినహా మిగిలిన 137 మునిసిపాలిటీలకు జూన్‌లో ఏకకాలంలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. వాస్తవానికి మే నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావించినా పురపాలక చట్టాలకు సవరణలు అవసరం కావడం తో కొంత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. మే చివరి నాటికి 58 మునిసిపాలిటీలు పదవీకాలాన్ని పూర్తి చేసుకోబోతున్నాయి.

రాజ్యాంగపరమైన అడ్డం కులతో 5 షెడ్యూల్డ్‌ ప్రాంత మునిసిపాలిటీలు ఇంతవరకు ఎన్నికలకు నోచుకోలేదు. కొత్తగా ఏర్పడిన 74 మునిసిపాలిటీలతోపాటు ఈ 63 మునిసిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ మునిసిపాలిటీలకు సంబంధించిన వార్డులవారీగా ఓటర్ల జాబితాలను ఈ నెల 28న ప్రచురించాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశిం చింది. ఏప్రిల్‌ చివరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ఖరారు, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బం ది నియామకం తదితర ప్రక్రియలను పూర్తి చేయనున్నారు. ఆలోగా పురపాలక చట్టాలకు సవరణ పూర్తయితే మే చివర్లో లేదా జూన్‌ తొలి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 

Videos

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)