amp pages | Sakshi

గనులు ఆర్థిక వ్యవస్థను మార్చేస్తాయి

Published on Thu, 10/24/2019 - 04:50

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక వ్యవస్థను మార్చే శక్తి మైనింగ్‌ రంగానికి ఉందని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. దేశ ప్రగతిని గనులు నిర్దేశిస్తాయని అన్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ (తెలంగాణ స్టేట్‌ సెంటర్‌) ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌ ఆడిటోరియంలో ‘మైనింగ్‌– ప్రజెంట్‌ అండ్‌ ఫ్యూచర్‌–ఇన్వెస్టిమెంట్స్, ఇష్యూస్‌ అండ్‌ ఛాలెంజెస్‌’అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి మైనింగ్‌ ఇంజనీర్లు, మేధావులు, నిపుణులు పాల్గొంటున్నారు. ఈ సదస్సు ప్రారంభోత్సవం అనంతరం స్పీకర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థకు మూలం గనులేనని, వాటిని క్రమపద్ధతిలో వినియోగించుకుంటే అభివృద్ధిని పరుగులు పెట్టించవచ్చన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మైనింగ్‌లో విప్లవాత్మక మార్పులు జరిగాయని, ఆదాయం కూడా భారీగా పెరిగిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004–2013 మధ్య కాలంలో ఇసుకపై వచి్చన ఆదాయం రూ.13.66 కోట్లయితే.. తెలంగాణ ఏర్పాటు తర్వాత వచి్చన ఆదాయం రూ.2,383 కోట్లని తెలిపారు. ప్రారంభోత్సవ సదస్సు అనంతరం సెషన్ల వారీగా వివిధ అంశాలపై బృంద చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో పాల్గొన్న యువ ఇంజనీర్లను ఉద్దేశించి వక్తలు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి మహముద్‌ అలీ, ఎఫ్‌ఐఈ ప్రెసిడెంట్‌ టీఎం గుణరాజా, చైర్మన్‌ డాక్టర్‌ జి.రామేశ్వరరావు, హైదరాబాద్‌ చాప్టర్‌ చైర్మన్‌ బీఆర్‌వీఎస్‌ సుశీల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)