amp pages | Sakshi

రాసుకున్నోళ్లకు రాసుకున్నంత..!

Published on Sat, 11/04/2017 - 11:40

కోదాడ: రాసుకున్నోళ్లకు రాసుకున్నంత.. అన్నట్టుగా మారింది.. కోదాడలోని పాలిటెక్నిక్‌ పరీక్షల వ్యవహారం. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాల్సిన కళాశాలల యా జమాన్యాలే అడ్డదారులు తొక్కుతున్నాయి. పరీక్షల విధులను నిర్వహించడానికి ఇతర కళాశాలల నుంచి వస్తున్న ఇన్విజిలేటర్లను పరీక్షహాళ్లోకి వెళ్లనీయకుండా తమ వారిని పంపించడం, వినని వారిని కరెన్సీతో మ్యానేజ్‌ చేయడం లేదంటే బెదిరించడం పరిపాటిగా మారిందనే  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోదాడలో సుమారు 5 వేల మంది విద్యార్థులు  పాల్‌టెక్నిక్‌  పరీక్షలు రాస్తున్నారు. కొన్ని కళాశాలలు  పాస్‌ గ్యారెంటీ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.4 నుంచి 5 వేలు వసూలు చేస్తున్నారని తెలిసింది.  

వచ్చి కూర్చొని .. ఇచ్చింది తీసుకు వెళ్లండి...
అక్టోబర్‌ 25 నుంచి పాలిటెక్నిక్‌ ప్రథమ, ద్వితీయ, అక్టోబర్‌ 26 నుంచి తృతీయ సంవత్సర సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. సెల్ఫ్‌ సెంటర్‌లో పరీక్షలు జరుగుతుండడంతో కళాశాలల యాజమాన్యాలు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఇన్విజిలేషన్‌ విధులకు వస్తున్న ఇతర కళాశాలల అధ్యాపకులకు డ్యూటీలు వెయ్యడం లేదని సమాచారం. వచ్చిన వారిని కూర్చోబెట్టి తమ కళాశాలవారికే డ్యూటీలు వేసుకుని  జోరుగా మాస్‌ కాపీయింగ్‌ను జరుపుతున్నారని కొందరు అధ్యాపకులే ఆరోపిస్తున్నారు. దీనికోసం రెండు కళాశాలలు విద్యార్థుల నుంచి డబ్బుల వసూలుకు తెరలేపినట్టు తెలుస్తోంది. మాట వినని ఇన్విజిలేటర్లకు భారీగా ముట్టజెపుతున్నారు. ఒక రోజు డ్యూటీ చేస్తే రెండు మూడు వందలు ఇస్తారు. కాని కొన్ని కళాశాలలు తాము చెప్పినట్లు వింటున్న ఇతర కళాశాలల అధ్యాపకులకు ఒక్క రోజు డ్యూటీకి ఐదు వేల రూపాయలను ముట్టజెపుతున్నారని సమాచారం. వచ్చి కూర్చొని ఇచ్చింది తీసుకువెళ్లండని, మాట వినని వారిని ఘాటుగా బెదిరిస్తున్నట్లు కొందరు మహిళా అధ్యాపకులు వాపోతున్నారు.

అన్నీ మేనేజ్‌
పాలిటెక్నిక్‌ పరీక్షల నిర్వహణ సీసీ కెమెరాల నడుమ పకడ్బందీగా నిర్వహించే ఏర్పాట్లు చేసినా వాటిని కూడా ఏమార్చి తమ దందా సాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాస్‌ కాపియింగ్‌  జరగకుండా చూడాల్సిన స్క్వా డ్‌లు అతిథుల వలె వచ్చిపోతున్నారని అధ్యాపకులే అంటున్నారు. పాస్‌ గ్యారెంటీ స్కీంలో భాగంగా జరుగుతున్న ఈ తంతంగంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

అవకాశంగా మారిన పరీక్షల విధానం
గతంలో సెల్ఫ్‌ సెంటర్లతో పాలిటెక్నిక్‌ పరీక్షలను నిర్వహించేవారు. దీంతో కళాశాలలు అడ్డదారులు తొక్కుతున్నాయనే ఆరోపణలు రావడంతో రాష్ట్ర సాంకేతిక విద్య అధికారులు ఒక కళాశాల విద్యార్థులను మరో కళాశాలకు మార్చి పరీక్షలు నిర్వహించారు. దీంతో మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం లేకపోవడం పాస్‌ పర్సెంటేజీ గణనీయంగా తగ్గిపోయింది. దీంతో పాలిటెక్నిక్‌ కోర్సుల్లో చేరే వారు తగ్గి పోతుండడంతో కంగుతిన్న కళాశాలలు తెర వెనుక లాబీయింగ్‌ జరిపి ఈ సారి ఆ విధానాన్ని ఎత్తి వేయించాయి. విద్యార్థులను మార్చకుండా ఏ కళాశాల విద్యార్థులు అదే కళాశాలలో  పరీక్షలు రాసే విధంగా పాత విధానాన్నే తిరిగి తెరమీదకు తెచ్చారు. కాక పోతే పరీక్షల నిర్వహించే ఇన్విజిలేటర్లను మాత్రం ఒక కళాశాల వారిని మరో కళాశాలకు మార్చారు.

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)