హైదరాబాద్‌ అభివృద్ధి ఇప్పుడే మొదలైంది

Published on Wed, 08/14/2019 - 15:16

సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌ అభివృద్ధి ఇప్పుడే మొదలైందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీ జేఎల్‌ఎల్‌ని ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్‌తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్‌ రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో విస్తరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. 2014లో రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు రూ.52 వేల కోట్లు ఉంటే.. 2019లో లక్షా 9 వేల కోట్లకి చేరిందని అన్నారు. నగరంలో మౌలికవసతులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, మంచినీటి కొరత తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. త్వరలో లుక్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చి నగరంలోని తూర్పుప్రాంతంలో ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇస్తామన్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును హైదరాబాద్‌లో కేవలం 36 శాతం మంది మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీన్ని పెంచాల్సిన అవసరముందని తెలిపారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ