amp pages | Sakshi

పాపం.. జాఫర్‌

Published on Sat, 10/28/2017 - 19:31

కోరుట్ల: ఎడారి దేశాల్లో ఎంతో కొంత సంపాదిచుకుని తమను సంతోషంగా ఉంచుతాడని ఆశించిన ఆ కుటుంబానికి వలసజీవి మృతివార్త అశనిపాతంగా మారింది. ఏడాది కాలంగా ఒకే ఒక్కసారి భర్తతో మాట్లాడిన భార్య, పిల్లలు చివరకు ఆయన ఇక లేరనే సమాచారం అందడంతో హతాశులయ్యారు. ఫోన్‌ రాకున్నా.. డబ్బులు పంపకున్నా ఎక్కడో ఓ చోట పని చేసుకుని బాగానే ఉంటాడని అనుకున్న ఆ కుటుంబం మరణవార్తతో విషాదంలో మునిగిపోయింది. 

ఏడాది క్రితం..
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అర్ఫత్‌పురాకు చెందిన మహ్మద్‌ జాఫర్‌(43) ఏడాది క్రితం లేబర్‌ పనిమీద సౌదీకి వెళ్లాడు. ఆ తర్వాత నెలరోజులకు కుటుంబ సభ్యులతో ఓసారి మాట్లాడి తాను బాగానే ఉన్నానని చెప్పాడు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. ఆ తరువాత జాఫర్‌ నుంచి ఫోన్‌రాలేదు. జాఫర్‌కు సౌదీలోని అటవీ ప్రాంతంలో ఉద్యోగం కావడంతో ఫోన్‌ చేయలేకపోతున్నాడని కుటుంబసభ్యులు భావించారు. చివరకు శుక్రవారం సౌదీలో ఉన్న నిజామాబాద్‌ జిల్లా పెర్కిట్‌వాసి కోరుట్లకు సమాచారం ఇవ్వడంతో జాఫర్‌ మృతి సమాచారం తెలిసింది. 

అనుమానాస్పదంగా.. ఆలస్యంగా
సౌదీలోని ఖర్జూ పట్టణానికి సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఉండే హాయల్‌ అనే అటవీ ప్రాంతంలో మహ్మద్‌ జాఫర్‌ మృతదేహాన్ని అక్కడి పోలీసులు కనుగొన్నట్లుగా కుటుంబసభ్యులకు సమాచారం అందింది. ఈ నెల 2వ తేదీన జాఫర్‌ మృతి చెందాడని, అతడి మృతదేహాన్ని అల్‌జోఫ్‌ పట్టణంలోని సతారా ఆస్పత్రి మార్చురీలో ఉంచారని తెలిసింది. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో సహజ మరణంగా భావించి ఆసుపత్రిలో ఉంచినట్లు కుటుంబసభ్యులకు సమాచారం వచ్చింది. అయితే జాఫర్‌ అటవీ ప్రాంతంలో మృతి చెందడంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 25 రోజుల వరకు తమకు ఎలాంటి సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాఫర్‌ సౌదీలో కలివెల్లి అయిన ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో తెలియని కారణంగానే అతడిని గుర్తించడంలో ఆలస్యం జరిగిందని సౌదీలో ఉంటున్న పెర్కిట్‌ వాసి చెబుతున్నా..  అతడి మృతిపై అనుమానాలు వీడటం లేదు. 

మృతదేహం తెప్పించుకోలేని దీనస్థితి..
సౌదీలో మృతిచెందిన మహ్మద్‌ జాఫర్‌కు భార్య రిజ్వానా, ముగ్గురు మగ పిల్లలు జుబేర్‌(17), జమీర్‌(15), సమీర్‌(10) ఉన్నారు. భార్య రిజ్వానా బీడీలు చుడుతూ పిల్లలను చదివిస్తోంది. భర్త గల్ఫ్‌లో కాస్తోకూస్తో సంపాదిస్తే తమ జీవితాలు బాగుపడతాయని రిజ్వానా, పిల్లలు ఆశించారు. కుటంబ పెద్ద మృతితో దయనీయస్థితిలో పడ్డారు. సౌదీ నుంచి జాఫర్‌ మృతదేహాన్ని ఇండియాకు తెప్పించడం ఖర్చులతో కూడిన పని కావడం డబ్బులు లేక అక్కడే అంత్యక్రియలు పూర్తి చేయడానికి అంగీకరించే పరిస్థితిలో ఉన్నారు. జాఫర్‌ మృతదేహాన్ని తెప్పించడంతోపాటు కుటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు సాయం చేయాలని వేడుకుంటున్నారు.  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)