తిప్పర్తి: ఆపదలో ఆదుకునే వ్యక్తిని ..

Published on Tue, 12/04/2018 - 09:32

సాక్షి, తిప్పర్తి : నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఆపదలో ఆదుకునే వ్యక్తిగా తనను ఐదవసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఇండ్లూరు, మామిడాల, యాపలగూడెం, ఆరెగూడెం, గోదోరి గూడెం, ఎల్లమ్మగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కోమటిరెడ్డికి పూలమాలలు, హారతులతో స్వాగతం పలికారు. గ్రామాల్లోని వీధులగుండా ప్రచార వాహనంపై తిరుగుతూ చేయి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆయా కార్యక్రమాల్లో దుబ్బాక నర్సిం హారెడ్డి, జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్, టీడీపీ నాయకులు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, చింతకుంట్ల రవీందర్‌రెడ్డి, లింగారావు, లక్ష్మణ్‌రావు, వెంకన్న, పాదూరి నాగమణి, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణ, శరత్‌బాబు, ఈదయ్య, అంబేద్కర్, నామచక్రవర్తి, గోదా వెంకట్‌రెడ్డి, పాపిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, నామ చంద్రయ్య, పాశం సంజీవరెడ్డి, బద్దం సైదులు తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ : నా జీవితం ప్రజలకే అంకితం.. నాకున్న ఒక్కగానొక్క కొడుకు కూడా లేడు.. మీరే నా బిడ్డలు’ అని నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన 25వ వార్డు పాతపల్లె ప్రజలనుద్దేశించి మాట్లాడారు. చదువు, ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పాత పల్లె వారికి ప్రతీక్‌ ఫౌండేషన్‌ ద్వారా సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అక్కడి గ్రామస్తులంతా ఇది పాతపల్లెకాదు ఇక నుంచి కోమటిరెడ్డి పల్లె అంటూ నినాదాలు చేశారు. అంతకు ముందు గ్రామస్తులు గ్రామ శివారునుంచి ఆటపాటలతో స్వాగతం పలికారు. చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆయన వెంట కూటమి నాయకులు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, రియాజ్, పన్నాల గోపాల్‌రెడ్డి, కోఆప్షన్‌ సభ్యులు ఇబ్రహీం, మేకల కృష్ణ, భిక్షం, తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తాలు...

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ