amp pages | Sakshi

కొల్లూరు హట్స్‌పై వివాదం

Published on Mon, 09/29/2014 - 02:27

భద్రాచలం : పాపికొండల్లోని కొల్లూరు హట్స్ నిర్వహణ అంతరాష్ట్ర వివాదంగా మారింది. దీనిని పరిష్కరించేందుకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అధికారులు రంగంలోకి దిగారు. ఈ విషయంపై ఖమ్మం జిల్లాకు చెందిన భద్రాచలం ఐటీడీఏ పీఓ దివ్య, ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి, తూర్పుగోదావరి రంపచోడవరం ఐటీడీఏ పీఓ గంధం చంద్రుడు, ఏఎస్పీ సీహెచ్ విజయారావుతో పాటు ఇరు జిల్లాల రెవె న్యూ, అటవీ,పోలీసు, వన్యప్రాణి, పంచాయతీ రా జ్ తదితర శాఖల అధికారులు ఆదివారం కొల్లూ రు కొండరెడ్డి గ్రామంలో సమావేశమయ్యారు. జిల్లా అధికారులు పాపికొండల వరకు ప్రత్యేక లాంచీలో వెళ్లగా తూర్పుగోదావరి జిల్లా అధికారులు అటు నుంచి లాంచీలో కొల్లూరు వచ్చారు.
 
వివాదానికి కారణమేమిటంటే :
కొల్లూరు వద్ద కైగాల సత్యనారాయణ అనే గిరిజనేతరుడు పదేళ్లుగా హట్స్‌ను నిర్వహిస్తున్నాడు పాపికొండల పర్యటనకు వచ్చే వారు కొల్లూరులో రాత్రి బస చేసేందుకు వీలుగా సకల సౌకర్యాలతో హట్స్ ఏర్పాటు చేశారు. ఇటీవల పర్యాటకుల తాకిడి పెరగడంతో ఇది లాభసాటి వ్యాపారంగా మారింది. ఏడాదికి సుమారు కోటి రూపాయల వరకు ఆదాయం వస్తుండడం హట్స్‌ను తామే నిర్వహించుకుంటామంటూ కొల్లూరుకు చెందిన కొండరెడ్లు ముందుకు వచ్చారు. ఈ విషయంపై ఈ గ్రామ సర్పంచ్ వాళ్ల కోటేశ్వరరెడ్డితో పలువురు కొండరెడ్డి గిరిజనులు ఐటీడీఏ పీఓ దివ్యకు విన్నవించారు. అందుకు స్పందించిన పీఓ దివ్య ‘పెసా’ చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక గిరిజనులకే సర్వాధికారాలు ఉంటాయని చెప్పి హట్స్ నిర్వహణ బాధ్యతలను కొండరెడ్లకు అప్పగించాలని డివిజనల్ పంచాయతీ అధికారి ఆశాలతకు సూచించారు.

ఈ నేపథ్యంలో డీఎల్‌పీఓ గ్రామ సభ ఆమోదం మేరకు హట్స్ నిర్వహణకు వేలం పాట ఏర్పాటు చేశారు. రూ. 25లక్షలు చెల్లించి హట్స్ నిర్వహించేందుకు ఆ గ్రామానికి చెందిన ఒక కొండరెడ్డి గిరిజనుడు ముందుకు వచ్చాడు. దీంతో వివాదం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన మండలాల్లో తెలంగాణకు చెందిన అధికారులు వచ్చి వేలం నిర్వహించడమేమిటని అప్పటి వరకు హట్స్ నిర్వహిస్తున్న వ్యక్తి నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది. అంతేకాకుండా వేలం నిర్వహణపై అతను కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. దీని గడువు సోమవారంతో ముగియనుంది.  పాపికొండల ప్రాంతం తమ పరిధిలోకి వస్తుందని, హట్స్ నిర్వహించడానికి వీల్లేదని రాజమండ్రికి చెందిన వన్యప్రాణుల విభాగానికి చెందిన అధికారులు రంగంలోకి దిగారు. దీనికి బాధ్యుడిని చేస్తూ రంపచోడవం ఐటీడీఏ పీవోపై వారు కోర్టును ఆశ్రయించారు.
 
గిరిజనులకు అండగా అధికారులు :
కొండరెడ్డి గిరిజనులకు హట్స్ నిర్వహణ బాధ్యతలు దక్కకుండా చేసేందుకు యత్నిస్తున్నారని భావించి భద్రాచలం ఐటీడీఏ పీఓ దివ్య రంపచోడవరం అధికారులతో చర్చించారు. అందులో భాగంగా ఆదివారం వారితో సమావేశం ఏర్పాటు చేశారు. పెసా చట్టం ప్రకారమే హట్స్ నిర్వహణ బాధ్యతలను గిరిజనులకు అప్పగించామనే విషయాన్ని రంపచోడవరం పీఓ గంధం చంద్రుడు, భద్రాచలం, రంపచోడవరం ఏఎస్పీలు ప్రకాష్‌రెడ్డి, విజయారావులతో చెప్పించారు. ఈ పర్యటన లో కొండరెడ్డి ప్రత్యేకాధికారిణి మల్లీశ్వరి, డీఎల్‌పీఓ ఆశాలత, వీఆర్‌పురం తహశీల్దార్ నాగమల్లేశ్వరావు, ఎంపీడీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
 
చక్రబంధంలో చిక్కుకున్న కైగాల
కొల్లూరు హట్స్ నిర్వాహకుడైన కైగాల సత్యనారాయణ చక్రబంధంలో చిక్కుకుపోయారు. సమన్వయ సమావేశం కోసమని వెళ్లిన భద్రాచలం ఏఎస్పీ ప్రకాష్ రెడ్డి అంతకుముందు కైగాల సత్యనారాయణ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 33 పెద్ద బీరు బాటిళ్లు, 9 చిన్న బీరు బాటిళ్లు, 16 బ్రీజర్‌లు, 43 ఓల్డ్ ట్రావెల్ మద్యం సీసాలు లభ్యమయ్యాయి. అనుమతులు లేకుండా మద్యం నిల్వ చేసినందుకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేస్తున్నట్లు ప్రకటించారు.

అలాగే కొల్లూరులో కైగాల సత్యనారాయణ ఆధీనంలో ఉన్న 20వ సర్వేనంబర్‌లోని భూమిని గ్రామకం ఠం భూమిగా రెవెన్యూ అధికారులు ప్రకటించారు. దీంతో అతనిపై ప్రభుత్వ భూ ఆక్రమణ కేసు నమోదుకు రంగం సిద్ధం చేశారు. అదే విధంగా ఏజె న్సీ ప్రాంతంలో గిరిజనేతరుడు వ్యాపారాలు చేస్తున్నందున ఎల్‌టీఆర్ కేసు నమోదు చేయాలని పీఓలు దివ్య, గందం చంద్రుడులు స్థానిక తహశీల్దార్‌లను ఆదేశించారు.  మరోపక్క సోమవారంతో అతను తెచ్చుకున్న కోర్టు స్టే గడువు ముగియనుంది. దీంతో అతను ఇంటి సమీపంలో వేసిన హట్స్‌ను తొలగించాలని హెచ్చరించారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)