amp pages | Sakshi

కంప్యూటర్‌ కాలం.. కిరోసిన్‌ ఫ్యాన్‌

Published on Tue, 02/25/2020 - 08:57

సాక్షి సిటీబ్యూరో: కిరోసిన్‌ ఫ్యానా..అదేంటి.. అనుకుంటున్నారా.. అవునండీ.. సిటీలో ఇంకా కిరోసిన్‌ఫ్యాన్లు ఇంకా కొందరు ఉపయోగిస్తున్నారు. నిజాం కాలం నాటి పురాతన ఫ్యాన్లు పాతబస్తీలో అక్కడక్కడా వాడుతున్నారు. ఫ్యాన్‌ కనుగొన్న తొలినాళ్లలో విద్యుత్‌తో కాకుండా వేడితో తిరిగేలా చేసేవారు. మరో విషయమేమంటే.. ఇప్పటికీ ఇలాంటి ఫ్యాన్లను రిపేరు చేసేవారు కూడా ఉన్నారు. 

విదేశాలనుంచి దిగుమతి...
నిజాం పాలనలో నగరానికి వివిధ దేశాలనుంచి టెక్నాలజీ దిగుమతి అయ్యేది. ముఖ్యంగా  ఇళ్లలో వినియోగించే  ఫ్యాన్లు, విద్యుత్తు పరికరాలు, వాహనాలు, షాండిలియర్స్, రిఫ్రీజిరేటర్లు తదితర వస్తువులు తయారైంది ఆలస్యం సిటీకి వచ్చేవి. అలా కిరోసిన్‌ ఫ్యాన్‌ కూడా  ఇంగ్లండ్‌ నుంచి వచ్చింది. పాతబస్తీలోని పురానీహవేలీ నివాసి మహ్మద్‌ హనీఫ్‌ ఇల్యాస్‌ బాబా ఇంట్లో కిరోసిన్‌ ఫ్యాన్‌ ఇంకా పనిచేస్తోంది.

డిజైన్‌ డిఫరెంట్‌..
దీనిని 1800లో ఇంగ్లాండ్‌లో కనుగొన్నారు. ఫ్యాన్‌ కింది బాగం గుండ్రంగా ఉంటుంది. ఇందులో కిరోసిన్‌ వేస్తారు. ఓ చివర దీపం వెలిగిస్తారు. దీపం నుంచి పైపుల ద్వారా వేడి పైకి వెళుతుంది.దీని రూపకల్పనలో నీరు, సల్ఫ్యూరిక్‌ ఆమ్లం ఉపయోగించారు. కింద వెనుక బాగంలో కాస్త పైప్‌ ఉంటుంది. ఇందులో వేడితో పాటు గ్యాస్‌ ప్రవేశిస్తుంది. దీంతో ఆవిరితో ఫ్యాన్‌ తిరగడం ప్రారంభమవుతుంది. ఎంత వేడి పెంచితే అంత వేగంగా రెక్కలు తిరుగుతాయి.  

నగరంలోనే అరుదుగా..
1980 వరకు పాతబస్తీలోని పలు ఇళ్లలో వినియోగించే వారు. విద్యుత్తుతో నడిచే ఫ్యాన్లు  మార్కెట్‌లో వచ్చాక  దీనిగురించి ఆలోచించడం మానేశారు.  పలు ఇళ్లల్లో పదేళ్ల క్రితం వరకు వినియోగించారని పురానీ హవేలీ నివాసి ముజాహిద్‌ తెలిపారు.

Videos

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)