ఆలస్యం.. ఆవేదనభరితం

Published on Tue, 03/17/2020 - 10:41

రంగారెడ్డి, పెద్దేముల్‌: మండల కేంద్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్ష కేంద్రానికి ఇద్దరు విద్యార్థినులు ఆలస్యంగా వచ్చారు. దీంతో వారిని అధికారులు అనుమతించలేదు. దీంతో విద్యార్థినులు కన్నీటిపర్యంతమయ్యారు. సోమవారం పెద్దేముల్‌ మండల కేంద్రంలో ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్‌ పరీక్షలు నిర్వహించారు. బంట్వారం మండలంలోని మోడల్‌ కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థినులు అనూష, స్వర్ణలత ఉదయం 9.20 నిమిషాలకు వచ్చారు. ఆలస్యంగా  పరీక్ష కేంద్రానికి రావడంతో అధికారులు వారిని అనుమతి ఇవ్వలేదు. బంట్వారం మండలం బోపూనారం నుంచి మోమెడ్‌పై రావడంతో అలస్యమైందని పరీక్షకు అనుమతి ఇవ్వాలని విద్యార్థినులు కోరినా అధికారులు స్పందించలేదు. దీంతో విద్యార్థినులు అక్కడే కుప్పకూలిపోయారు. ఏఎన్‌ఏం వారికి జ్యూస్‌ పంపిణీ చేశారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ