amp pages | Sakshi

బాబోయ్‌.. ‘వడ్డీ’ జోలికెళ్లొద్దు

Published on Fri, 12/08/2017 - 01:01

సాక్షి, హైదరాబాద్‌: రైతు రుణాల మాఫీకి సంబంధించి వడ్డీ చెల్లింపులపై ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. విపక్షాల విమర్శలు, ఫిర్యాదుల నేపథ్యంలో వడ్డీ చెల్లింపులను ఆరా తీసిన ప్రభుత్వానికి.. ఒక్కోచోట ఒక్కో తీరుగా లెక్కలున్నట్లు, కొన్ని చోట్ల రైతుల నుంచి వడ్డీనీ వసూలు చేసినట్లు తెలిసింది. వడ్డీ లెక్కలన్నీ నిగ్గుతేల్చగా రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్లకు పైగా చెల్లించాల్సి వస్తుందని తేలింది. బ్రాంచీల వారీగా రైతుల ఖాతాలు మళ్లీ పరిశీలించి ఎవరిపై వడ్డీ భారం పడింది, ఎంత చెల్లించాలి లాంటి లెక్కలు తీయ డం అసాధ్యమని, ఎక్కువ సమయం పడుతుందని సర్కారు అభిప్రాయానికి వచ్చింది.  

మూడేళ్లలో రూ.17 వేల కోట్లు..
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రుణమాఫీని అమలు చేసింది. రూ.లక్ష లోపు పంట రుణాలన్నీ మాఫీ చేసింది. రూ. 17 వేల కోట్లను మూడేళ్లలో బ్యాంకులకు చెల్లించి 35 లక్షల మంది రైతులు రుణ విముక్తులైనట్లు ప్రకటించింది.  కొన్ని బ్యాంకులు రైతుల నుంచి బలవంతంగా వడ్డీ వసూలు చేశాయని ఆరోపణలొచ్చాయి.

శాసనసభలో విపక్షాలూ ఈ అంశాన్ని లెవనెత్తడంతో సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. ‘ఎక్కడైనా ఫిర్యా దులుంటే.. రూ.100 కోట్లు.. రూ. 200 కోట్లు ఉంటే చెల్లించేద్దాం..   విచారణ చేప ట్టండి’అని అధికారులను పురమాయించారు. మాఫీ అమలును పరిశీలించిన అధికారులు.. వడ్డీల అంశం సంక్లిష్టంగా ఉందని, సమస్యను జటిలం చేయకుండా ఉండటమే మంచిదని ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది.  

రాష్ట్రం 4 శాతం.. కేంద్రం 7 శాతం..
సాధారణంగా పంట రుణాల వడ్డీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. రాష్ట్రం 4, కేంద్రం 7 శాతం బ్యాంకులకు చెల్లిస్తాయి.  రుణాల గడువు మీరితే నిబంధన వర్తించకపోతే వడ్డీ లేని రుణ పథకం వర్తించకపోగా.. 11 శాతం వడ్డీని రైతులే భరించాల్సి వస్తుంది. ప్రభుత్వం రుణమాఫీని దశల వారీగా చెల్లించడంతో కొన్నిచోట్ల రుణాలను గడువు మీరిన ఖాతాలో వేసుకున్నారు. దీంతో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన అధికారులు ఒక్కోచోట ఒక్కో తీరుగా లెక్కలు ఉండటం.. కొన్ని చోట్ల రైతుల నుంచి వడ్డీ వసూలు చేసినట్లు గుర్తించారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)