amp pages | Sakshi

ఇన్‌పుట్ సబ్సిడీపై ఆందోళన

Published on Sat, 09/20/2014 - 03:38

బెజ్జంకి :
ఇన్‌పుట్ పరిహారం పంపిణీలో జాప్యంతోపాటు 1బీ అనుసంధానంతో అర్హులైన రైతులు, కౌలు రైతులకు అన్యాయం చేస్తున్నారని అఖిలపక్ష నేతలు ఆందోళనకు దిగారు. బెజ్జంకి క్రాసింగ్ రాజీవ్హ్రదారిపై స్థానిక కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, బీఎస్పీ, టీడీపీ నాయకులు రైతులతో కలిసి శుక్రవారం మహాధర్నా నిర్వహించారు. గంటన్నరపాటు ఆందోళన కొనసాగింది. ప్రభుత్వానికి, స్థానిక నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అఖిలపక్షనాయకులు, పో లీసులకు వాగ్వాదం, తోపులాట జరిగింది. తహశీల్దార్ ఈశ్వరయ్య చేరుకుని ఆందోళన విరమించాలని కోరా రు. కలెక్టర్ వచ్చి 1బీ లేకుండా, కౌలు రైతులకు  నిబంధనలు లేకుండా పరిహారం అందిస్తామని హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. బెజ్జంకి, తిమ్మాపూర్ ఎస్సైలు ఉపేందర్‌రావు, దామోదర్‌రెడ్డి,రాజమౌళి, ఆర్మీ సిబ్బంది అఖిలపక్షనాయకులను అదుపుతీసుకున్నా రు. వారిని వాహనంలో ఠాణాకు తరలించేందుకు ప్ర యత్నిస్తుండగా ఇతరులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని పోతారంమీదుగా ఠాణాకు తరలించారు.
 మండల పరిషత్‌లో ఫర్నిచర్ ధ్వంసం
 మహాధర్నా విరమించిన అఖిలపక్ష నాయకులు మండల పరిషత్ చేరుకుని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈక్రమంలో వడ్లూరుకు చెందిన మాజీ సర్పంచ్ గాండ్ల తిరుపతి తలకు గాయమైంది. అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై ఉపేందర్‌రావు పరిశీలించారు. దాడికి పాల్పడిన వారిపై ఎంపీపీ ఒగ్గు దామోదర్, ఎంపీడీవో  శ్రీనివాస్ వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆందోళనలో  కేడీసీసీబీ డెరైక్టర్ చింతలపల్లి రవీందర్‌రెడ్డి,  నాయకులు అన్నాడి మల్లారెడ్డి, రామచంద్రం, కరివేద మహిపాల్‌రెడ్డి, తీగల మోహన్‌రెడ్డి, నగునూరి శంకర్, గూడెల్లి తిరుపతి, రూపేశ్, రైతులు పాల్గొన్నారు.



 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)