amp pages | Sakshi

అర్చకుల వేతన క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం

Published on Fri, 12/01/2017 - 03:12

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో దేవాలయ ఉద్యోగులు, అర్చకులకు వేతనాలు చెల్లించే కొత్త విధానానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఉద్యోగ, అర్చక సంఘాల ప్రతినిధులకు చెక్కులు అందించి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. డిసెంబర్‌ నుంచే సెక్షన్‌ 65ఏ ప్రకారం వేతనాలు చెల్లించనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేవాదాయశాఖకు రూ.37.5 కోట్లు విడుదల చేసింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కొత్త విధానం అమలుకు వీలుగా చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే.

ఇంతకాలం దేవాలయాల ఆదాయం నుంచి ఆలయ కార్యనిర్వహణాధికారులు వేతనాలు చెల్లించారు. ఇకమీదట ధార్మిక పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక వేతన నిధి నుంచి వేతనాలు చెల్లిస్తారు. అర్చకులు, ఉద్యోగుల ఖాతాలకు ఆ మొత్తాన్ని జమ చేస్తారు. దేవాలయ ఆదాయం సరిపోనందున ప్రతినెలా తక్కువ పడే మొత్తాన్ని ప్రభుత్వమే గ్రాంటుగా చెల్లిస్తుంది. దీనిపై దేవాలయ ఉద్యోగ, అర్చక సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే వేతనాలను ధార్మిక పరిషత్‌ నుంచే చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పరిషత్‌ ఏర్పాటు కాకపోవటం విశేషం.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌