మరో రెండ్రోజులు భారీ వర్షాలు..

Published on Sun, 01/27/2019 - 18:43

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణం కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలోని విదర్భలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో శనివారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌ సహా తెలంగాణ అంతటా కురుస్తున్న వర్షాలు మరో 48 గంటలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది.

తెలంగాణలో ఆదివారం 50 శాతం, సోమవారం 35 శాతం వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ (హైదరాబాద్‌) డైరెక్టర్‌ వై కరుణాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. మహారాష్ట్రలోని విదర్భలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో 50 శాతం వర్షపాతం నమోదవుతుందని, పలుచోట్ల ఉరుములుమెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్ల తక్షణ మరమ్మత్తులకు సంబంధిత అధికారులు, తుపాన్‌ బృందాలు రాగల 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ ఇంజనీరింగ్‌, మెయింటెనెన్స్‌ విభాగం అధికారులను ఆదేశించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ