అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
క్విక్ రెస్పాన్స్
Published on Thu, 11/07/2019 - 10:44
మల్లాపూర్: పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని ఓ యువకుడి ప్రాణాలు కాపాడిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్లాపూర్ కెఎల్రెడ్డినగర్లో ఉంటున్న లోకేష్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి మూడు నెలల క్రితం సరిత అనే యువతితో వివాహం జరిగింది. తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికిలోనైన లోకేష్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం తాను ఉంటున్న మూడో అంతస్తు పైకి సెప్టిక్ ట్యాంక్ పైప్ పట్టుకుని కిందకు దూకేందుకు యత్నించాడు. దీనిని గుర్తించిన స్థానికులు డయల్–100కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన మల్లాపూర్ ఏరియా పెట్రోలింగ్ సిబ్బంది రాములు, బాలనర్సింహలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లోకేష్‌కు న్యాయం చేస్తామని అతడికి నచ్చజెప్పారు. తాడు సహాయంతో అతడిని పైకి లాగి ప్రాణాలు కాపాడారు. సకాలంలో స్పందించిన పోలీసులను సీఐ మహేష్‌కుమార్, పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.
Tags