amp pages | Sakshi

కరోనా: కరీంనగర్‌లో హైటెన్షన్‌!

Published on Thu, 04/02/2020 - 12:20

సాక్షి, కరీంనగర్‌: కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో కరీంనగర్‌లో హై టెన్షన్ కొనసాగుతుంది. జిల్లాలో పర్యటించిన ఇండోనేషియాకు చెందిన పది మంది మతప్రచారకులతో పాటు నగరానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమయింది. ఈ క్రమంలోనే వైరస్‌ వ్యాప్తి నివారణకు పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఇండోనేషియా బృందం పర్యటించిన ప్రాంతాలను గత పది రోజులుగా దిగ్బంధం చేసి, ఆ ప్రాంతంలో నివాసం ఉండేవారు ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. బుధవారం ఆ ప్రాంతంలో వైద్య బృందాలతో ర్యాపిడ్ హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించగా కరోనా లక్షణాలు ఎవ్వరికీ లేకపోవడంతో ఇతర ప్రాంతాల వారి మాదిరిగా వారికి కాస్త వెసులుబాటు ఇచ్చారు. (మరో వారం రోజులు కీలకం..)

గురువారం ఒక్కసారిగా ఆ ప్రాంత వాసులు రోడ్లపైకి, మార్కెట్‌కు రావడంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం వెంటనే డేంజర్ జోన్ పరిధిలోని దారులన్నీ బారిగేడ్స్‌తో మూసివేసి పోలీస్ పహారా ఏర్పాటు చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మరో రెండు మూడు వారాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఢిల్లీ ప్రార్థనలకు వెళ్ళి వచ్చిన 57 మందిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు.‌ గురువారం ఉదయం నాటికి తెలంగాణలో 129 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఇప్పటి వరకు 1980 మంది కరోనా బారినా పడగా.. 59 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 144 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 9 లక్షలు దాటాయి.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌