amp pages | Sakshi

మీడియాను ఎందుకు అనుమతించడం లేదు?

Published on Thu, 07/23/2020 - 04:16

సాక్షి, హైదరాబాద్‌: సచివాలయంలోని భవనాల కూల్చివేత ప్రక్రియను కవర్‌ చేసేందుకు మీడియాను ఎందుకు అనుమతించడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వాతంత్య్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. కూల్చివేత ప్రక్రియను కవర్‌ చేసేందుకు మీడియాను అనుమతించడం లేదంటూ వీఐఎల్‌ మీడియా తరఫున జి.సంపత్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ విచారించారు.

భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి కూల్చివేతలను రహస్యంగా చేపడుతున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది నివేదించారు. పేల్చివేతల ద్వారా భవనాలను కూల్చివేస్తున్నామని, ప్రమాదాలు జరుగుతాయనే మీడియాను అనుమతించడం లేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. మీడియాను అనుమతిస్తే సాధారణ ప్రజలు కూడా వచ్చి కూల్చివేత ప్రక్రియకు అంతరాయం ఏర్పడటంతోపాటు ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. యుద్ధం జరుగుతున్న ప్రదేశాల్లోకే మీడియాను అనుమతిస్తున్న పరిస్థితి ఉందని, కూల్చివేత పనులు అంత రహస్యంగా చేపట్టాల్సిన అవసరం ఏముందని న్యాయమూర్తి ప్రశ్నించారు.

గుప్తనిధులున్నాయని, అందుకే రహస్యంగా కూల్చివేతలు చేపడుతున్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో పారదర్శకంగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కూల్చివేత ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలనే హక్కు ప్రజలకుందన్నారు. కూల్చివేత వీడియోలను ప్రభుత్వమే తీసి మీడియాకు ఇవ్వొచ్చుగా అని ఏజీని ప్రశ్నించారు. మీడియాకు ఒక పాయింట్‌ను కేటాయించి..వివరాలు తెలియజేయవచ్చని, పనులు ఆపిన సమయంలో వారిని అక్కడికి తీసుకెళ్లవచ్చని సూచించారు. అలాగే కోవిడ్‌ బులెటిన్‌ ఇస్తున్న తరహాలో ప్రతిరోజూ కూల్చివేతలకు సంబంధించిన సమాచారాన్ని ఫొటోలు, వీడియోలు తీసి ఇవ్వొచ్చునని, ఇందుకు అభ్యంతరం ఏముందని ఏజీని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వివరణ తీసుకుని చెబుతానని, వారం రోజుల సమయం కావాలని ఏజీ కోరగా..అందుకు వారం సమయం ఎందుకని నేటిలోగా తెలియజేయాలని సూచిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేశారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌