రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు

Published on Sat, 07/20/2019 - 02:32

సాక్షి, హైదరాబాద్‌: రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు, పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు శుక్రవారం పశ్చిమ రాజస్తాన్‌లోని మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించడంతో మొత్తం భారతదేశం అంతా విస్తరించాయని పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. 

వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం: 
దేవరకొండ (నల్లగొండ) 7 సెం.మీ., కొత్తగూడ (మహబూబాబాద్‌) 6 సెం.మీ., లక్ష్మణ్‌చాంద (నిర్మల్‌) 5 సెం.మీ., మద్దూర్‌ (మహబూబ్‌నగర్‌) 5 సెం.మీ., అల్లాదుర్గ్‌ (మెదక్‌) 4 సెం.మీ., శాయంపేట (వరంగల్‌ రూరల్‌) 4 సెం.మీ., తాండూర్‌ (వికారాబాద్‌) 4 సెం.మీ., మగనూర్‌ (మహబూబ్‌నగర్‌) 3 సెం.మీ., నిడమనూర్‌ (నల్లగొండ) 3 సెం.మీ., ఆత్మకూర్‌ (వరంగల్‌ రూరల్‌) 3 సెం.మీ., కెరిమెరి (కొమురం భీం) 3 సెం.మీ., మునిపల్లి (సంగారెడ్డి) 3 సెం.మీ., పోచంపల్లి 3 సెం.మీ., బూర్గంపాడు 3 సెం.మీ., భద్రాచలంలో 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ