amp pages | Sakshi

తెలంగాణలో ‘తొలకరి’ ఉత్సాహం

Published on Thu, 06/11/2020 - 02:30

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర రైతాంగం వానాకాలం సాగు కోసం పొలం బాట పడుతోంది. రుతుపవనాల ప్రవేశానికి ముందే తొలకరి జల్లులతో ఈ ఏడాది వర్షాలు బాగానే కురుస్తాయనే ఆశలు రైతుల్లో చిగురిస్తున్నాయి. సాగుకు వీలుగా భూమిని చదును చేసుకుని వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతాంగంలో ఈ తొలకరి జల్లులు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇప్పటికే ఏరువాకతో దుక్కి దున్ని, గొర్లు సిద్ధం చేసుకుని, నార్లు పోసుకునేందుకు సిద్ధంగా ఉన్న కర్షకుడు.. గత రెండ్రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలు మరో 3, 4 రోజులు కొనసాగితే ఇక పూర్తిస్థాయిలో పొలం బాట పట్టనున్నాడు. బుధ వారం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలు మరో రెండ్రోజులు కొనసాగుతాయని, గురువారం 12 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

భువనగిరిలో అత్యధికం..
బుధవారం రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాజధాని హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోనూ వర్షపాతం నమోదైందని వాతావరణ గణాంకాలు వెల్లడించాయి. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో అత్యధికంగా 16.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, వరంగల్‌ (అర్బన్, రూరల్‌), యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, జనగామ జిల్లాల్లో ఒకట్రెండుచోట్ల గురువారం భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం కూడా భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

  • యాదాద్రి జిల్లా భువనగిరిలో అత్యధికంగా కురిసిన వర్షపాతం - 16.9 సెం.మీ. 
  • నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే జిల్లాల సంఖ్య -12

రుతుపవనాల విస్తరణ
తమిళనాడులో మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, త్రిపుర మిజోరంలో కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు బుధవారం విస్తరించాయి. మధ్య అరేబియా సముద్రం, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాలు, తెలంగాణ, కోస్తా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు, మధ్య, ఉత్తర బంగాళాఖాతం, ఈశాన్య భారతదేశంలో మరికొన్ని  ప్రాంతాల్లోకి వచ్చే 48 గంటల్లో విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాతి 48 గంటల్లో మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర, బంగాళాఖాతం, ఈశాన్య భారతదేశంలో మిగిలిన ప్రాంతాలు, సిక్కింలోని మొత్తం ప్రాంతాలు, ఒడిశా, పశ్చిమబెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వెల్లడించింది.

కొనసాగుతున్న అల్పపీడనం
తూర్పు, మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పియర్‌ ఎత్తు వరకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది 48 గంటల్లో పశ్చిమ వాయువ్యం దిశగా ప్రయాణించి బలపడే అవకాశం ఉందని, దీని కారణంగానే రాష్ట్రానికి వర్ష సూచన ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. 

బుధవారం అత్యధిక వర్షపాతం (సెం.మీ.) నమోదైన ప్రాంతాలు

  జిల్లా   గ్రామం/పట్టణం  వర్షపాతం
యాదాద్రి     భువనగిరి     16.9
యాదాద్రి   మర్యాల   13.7
ఆదిలాబాద్‌     పోచర     11.8
యాదాద్రి వెంకిర్యాల 10.5
ఖమ్మం  మధిర 9.3
యాదాద్రి యాదగిరిగుట్ట 8.85
ఖమ్మం ఎర్రుపాలెం 8.85
వరంగల్ అర్బన్‌ కాశీబుగ్గ 8.75

(రంగారెడ్డి, వరంగల్‌ (అర్బన్‌/రూరల్‌ జిల్లాలు), సిద్దిపేట, యాదాద్రి, ఖమ్మం,నిజామాబాద్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 7 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది)
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌