amp pages | Sakshi

అందరికీ ఆరోగ్య కార్డులు

Published on Thu, 02/13/2020 - 01:37

సాక్షి, సంగారెడ్డి: రాష్ట్రం లోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య కార్డులు అందించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.3.5 కోట్లతో ఏర్పాటు చేసిన కార్డియాలజీ, యూరాలజీ విభాగాలను బుధవారం ఆయన ప్రారంభిం చారు. సంబంధిత విభాగాలను పరిశీలించి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికీ హెల్త్‌ కార్డులు అందించాలని సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారని చెప్పారు.

త్వరలో ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చనుందని తెలిపారు. ప్రపంచంలోని ఒక్క అమెరికాలోనే ఈ తరహా హెల్త్‌ కార్డుల విధానం అమలులో ఉందని, తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలని సీఎం భావిస్తున్నారని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలోనే కార్డియాలజీ, యూరాలజీ విభాగాల ఏర్పాటుతో జిల్లాలోని మారుమూల ప్రాంతాలైన జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్‌ల ప్రజలను హైదరాబాద్‌కు తరలించకుండా ఇక్కడే మెరుగైన వైద్యం అందించ్చవచ్చన్నారు. 

మరణాలు తగ్గి ప్రసవాలు పెరిగాయి.. 
కేసీఆర్‌ కిట్‌ ప్రవేశపెట్టినప్పటి నుంచి మాతా శిశు మరణాలు తగ్గాయని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గతంలో సాధారణ ప్రసవాలు 30 నుంచి 35% మాత్రమే జరిగేవని, ప్రస్తుతం అవి 65 నుంచి 70 శాతానికి పెరిగాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు, ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌