విద్యుదాఘాతంతో రైతు మృతి

Published on Tue, 10/06/2015 - 23:19

తిమ్మారెడ్డిగూడెం(మునగాల) : విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బారెడ్డి వెంకట్‌రెడ్డి(45) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.  మధ్యాహ్నం తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. విద్యుత్ సరఫరా ఉన్నప్పటీకీ మోటారు నడవక పోవడంతో సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి చూడగా ఎల్‌టీ లైన్ తెగి పడి ఉండడాన్ని గమనించాడు.
 
 తెగిన విద్యుత్ వైరును అమర్చేందుకు పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆపేందుకు ప్రయిత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాన్స్‌ఫార్మర్ పైన ఉన్న హెవీలైన్‌ను నుంచి విద్యుత్ సరఫరా కావడంతో వెంకట్‌రెడ్డి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెం దాడు. ఈ లోగా పక్కనే ఉన్న ఇద్దరు రైతులు వచ్చి వెంకట్‌రెడ్డిని కిందకు దించారు. ఎల్‌టీలైన్‌కు ఆనుకొని హెవీలైన్ ఉండడం మూలంగానే ఈ ప్రమాదం సంభవించిందని రైతులు తెలిపారు. మృతుడికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామ రెవెన్యూ అధికారి వారణాసి ఉషారాణి ఫిర్యాదు మేరకు మునగాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ