amp pages | Sakshi

కోడి పెట్టిన గుడ్డేనా?

Published on Thu, 06/08/2017 - 04:18

సాగుతున్న పెంకు.. కాలిస్తే ప్లాస్టిక్‌ వాసన
 
కరీమాబాద్‌(వరంగల్‌ తూర్పు): వరంగల్‌లోని కరీమాబాద్‌లో అంగన్‌వాడీ కేంద్రంలో పంపిణీ చేసిన కోడి గుడ్లు కృత్రిమమైనవిగా స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఏడాది వయస్సున్న తన కొడుకు రుత్వేజ్‌ కోసం స్థానికు రాలు బండి స్వరూప కాశికుంటలోని అంగన్‌వాడీ కేం ద్రం నుంచి కోడిగుడ్లు తీసుకొచ్చింది. బుధవారం కోడిగుడ్లను ఉడకబెట్టి పెంకు తీస్తుండగా కింది పొర ప్లాస్టిక్‌లా సాగడం, పసుపు రంగు ఓ రకమైన వాసన వచ్చిందని  చెప్పారు. కోడిగుడ్డుపై తెల్లని పొరను కాల్చగా ప్లాస్టిక్‌లా ముడుచుకుపోయిందన్నారు. దీనిపై అంగన్‌ వాడీ సూపర్‌ వైజర్‌ని అడగ్గా  ఈ విషయమై పరిశీలిస్తానని చెప్పారు.
 
గాంధారిలో: కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సోమారం తండాలోని అంగన్‌వాడీ కేంద్రానికి సరఫరా చేసిన గుడ్లు ప్లాస్టిక్‌లా ఉన్నాయని స్థానికులు ఆరోపిం చారు. గుడ్లను ఉడికిస్తే ప్లాస్టిక్‌లా ముద్దగా అవుతున్నా యని చెప్పారు. స్థానికుల ఫిర్యాదుతో ఐసీడీఎస్‌ అధికా రులు బుధవారం అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు.  

Videos

ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్

టీడీపీ నాయకుల దాష్టీకం..

జగన్నాథుడి జైత్రయాత్ర తథ్యం..కూటమి కుట్రలు పారలేదు

కేతిరెడ్డి పెద్ద రెడ్డి ఇంట్లో పోలీసుల వీరంగం

వైఎస్సార్సీపీ గెలుపుతో చంద్రబాబు రథచక్రాలు విరిగిపోతాయి...

గవర్నమెంట్ పాజిటివ్ వోట్ ముఖ్యంగా మహిళలు..గ్రాఫ్ చూస్తే..!

ఏపీలో రికార్డ్ స్థాయిలో పోలింగ్‌..

ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి..

మళ్లీ కలకలం రేపుతున్న సుచిత్ర లీక్స్..

ప్రేమలు హీరోయిన్ తో ప్రేమలో పడనున్న రౌడీ..

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)