amp pages | Sakshi

కూటమి ‘ఆశ’లు నెరవేరేనా!

Published on Sat, 11/17/2018 - 09:11

మెదక్‌ టికెట్‌పై కాంగ్రెస్‌ నేతల ఆశలు ఇంకా సడలడం లేదు. ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న నాయకుల్లో ఒక్కరికైనా బీ ఫాం దక్కకపోతుందా అనే ఆశతో ఉన్నారు. పొత్తులున్నప్పటికీ మెదక్‌లో స్నేహపూర్వక పోటీ ఉంటుందని భావిస్తున్నారు. అయితే శనివారం మెదక్‌ సీటుపై స్పష్టత రానుంది. కాంగ్రెస్‌ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితాను శనివారం ప్రకటించనుంది. కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించే మెదక్‌ స్థానం ఉంటుందని స్థానిక కాంగ్రెస్‌ నేతలు నమ్మకంగా ఉన్నారు. కాంగ్రెస్‌ బీఫాం దక్కుతుందని ఆశావహులంతా వరుసగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.     

సాక్షి, మెదక్‌:  మెదక్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, జిల్లా నాయకుడు మ్యాడం బాలకృష్ణలు కాంగ్రెస్‌ పార్టీ పేరిట నామినేషన్లు వేశారు. శుక్రవారం శశిధర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా మరో నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ బీసీ నేత బట్టి జగపతి కాంగ్రెస్‌ పార్టీ పేరిట నామినేషన్‌ వేశారు. ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న సుప్రభాతరావు, తిరుపతిరెడ్డిలు సైతం శనివారం ఉదయం నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్‌ ఆశావహులంతా నామినేషన్లు వేస్తున్నట్లు సమాచారం.

రెండు రోజుల క్రితం మెదక్‌ పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో కాంగ్రెస్‌ ఆశావహులు బట్టి జగపతి, సుప్రభాతరావు, తిరుపతిరెడ్డి, బాలకృష్ణ, చంద్రపాల్‌ సమావేశమయ్యారు. పొత్తులో భాగంగా మెదక్‌ స్థానాన్ని తెలంగాణ జన సమితికి ప్రకటించినప్పటికీ స్నేహపూర్వక పోటీ కోసం అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాలని ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. స్నేహపూర్వక పోటీకి అధిష్టానం అంగీకరించి ఆశావహుల్లో ఎవరికి బీఫాం దక్కినా మిగతా వారంతా నామినేషన్లు ఉపసహరించుకుని బీఫాం వచ్చిన నాయకుడి విజయం కోసం పని చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శనివారం పార్టీ తుది జాబితాను ప్రకటించనున్న నేపథ్యంలో ఆశావహులంతా శుక్రవారం కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతితో సమావేశమయ్యారు.

విజయశాంతి సైతం స్నేహపూర్వక పోటీకోసం కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థుల తుది జాబితా ప్రకటన అనంతరం స్నేహపూర్వక పోటీపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మహాకూటమిలో భాగంగా టీజేఎస్‌కు 8 సీట్లు ఇస్తే 12 స్థానాలను ప్రకటించుకుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ సీరియస్‌గా తీసుకుందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఏకపక్షంగా టీజేఎస్‌ సీట్లు ప్రకటించినందున స్నేహపూర్వక పోటీ అంశాన్ని ఏఐసీసీ పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అయితే టీజేఎస్‌ 8 సీట్లకు అంగీకరించిన పక్షంలో స్నేహపూర్వక పోటీ ఉంటుందా లేదా అన్న శంక కాంగ్రెస్‌ నేతలను కలవరపెడుతోంది. దీంతో ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న నాయకులంతా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

ఎన్నికల్లో పోటీకి శశిధర్‌రెడ్డి మొగ్గు 
కాంగ్రెస్‌ అధిష్టానం తనకు బీఫాం ఇస్తుందని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ధీమాగా ఉన్నారు. ఇది వరకే నామినేషన్‌ వేసిన ఆయన శుక్రవారం స్వతంత్ర అభ్యర్థిగా మ రోసెట్‌ నామినేషన్‌ వేశారు.
 కాంగ్రెస్‌ పార్టీ బీఫాం ఇవ్వ ని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయ న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే స్వతం త్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసినట్లు సమాచా రం. ఇదిలా ఉంటే శశిధర్‌రెడ్డి ఎన్‌సీపీ పార్టీ నుంచి పోటీ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)