amp pages | Sakshi

రవిప్రకాశ్‌కు పోలీసుల ప్రశ్నల పరంపర

Published on Wed, 06/05/2019 - 12:43

సాక్షి, హైదరాబాద్‌: టీవీ9 కేసులో ఫోర్జరీ, డేటా చౌర్యం తదితర నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆ చానల్‌ మాజీ సీఈఓ రవిప్రకాశ్‌ రెండోరోజు సైబర్‌ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యాడు. బుధవారం మధ్యాహ్నం  ఆయన సైబరాబాద్‌ సైబర్‌ క్రైం కార్యాలయానికి చేరుకున్నారు. రవిప్రకాశ్‌ను మంగళవారం ఐదు గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలకు రవిప్రకాష్‌ ఏమాత్రం సహకరించలేదని, పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. ఇక సైబర్‌ క్రైం కార్యాలయం వద్ద రవిప్రకాశ్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు. అనంతరం స్టేషన్‌లోకి వెళ్లారు. ఆయనకు పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు.
(సత్యాన్ని చంపేయబోతున్నారు : రవిప్రకాశ్‌)

  1. కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగ‌ర్వాల్ సంత‌కాన్ని ఫోర్జరీ చేసిందెవరు..? ఎందుకు చేయాల్సి వచ్చింది.
  2. తాజాగా కుదుర్చుకున్న ఒప్పంద పత్రాల‌తో ఎన్‌సీఎల్టీకి పాత తేదీలతో శివాజీతో మీరు ఫిర్యాదు చేయించడానికి కార‌ణాలేంటి..? 
  3. శివాజీకి 40 వేల షేర్లు ఎందుకు అమ్ముకోవాల్సి వ‌చ్చింది. మీ స్నేహితుడైన శివాజీకి షేర్లు బ‌దిలీ చేయ‌కుండా ఎందుకు చీట్ చేశారు ?
  4. మీడియా, మాఫియా మ‌ధ్య పోరాటం అంటున్నారు క‌దా..! టీవీ9 యాజ‌మాన్య మార్పిడి జ‌రిగినప్పుడు సీఈఓగా దానిని కొత్త యాజ‌మాన్యానికి అప్పగించాల్సిన బాధ్యత మీకు లేదా..?
  5. టీవీ9 లోగో అనేది ఆ సంస్థకు చెందిన ఆస్థి.. టీవీని అమ్మాం కానీ లోగోను అమ్మలేదంటూ మీరు మాట్లాడ‌టంలో ఏమైనా అర్థం ఉందా..?
  6. యాజ‌మాన్యానికి తెలియ‌కుండా టీవీ 9 నిధులను మీరు దుర్వినియోగం చేశారా ..?  లేదా..?
  7. ఒక‌వేళ మీరు ఎలాంటి త‌ప్పులు చేయ‌న‌ప్పుడు నెల‌రోజులుగా ఎందుకు త‌ప్పించుకు తిరిగారు...పోలీసుల‌కు ఎప్పుడో లొంగిపోయి వివ‌ర‌ణ ఇస్తే అయిపోయేది క‌దా.. అని పోలీసులు రవిప్రకాశ్‌కు పలు ప్రశ్నలు సందించారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)