amp pages | Sakshi

విధుల విభజనతో కరోనాపై యుద్ధం

Published on Sat, 06/20/2020 - 05:57

సాక్షి, హైదరాబాద్‌: కరోనా చికిత్సలో పాల్గొంటున్న వైద్యులు, వైద్య సిబ్బందిపైనా కరోనా పంజా విసురుతోంది. అన్నిరకాల జాగ్రత్తలు పాటిçస్తూ చికిత్స చేసేందుకు ముందుకొస్తున్నప్పటికీ వారుకూడా కరోనా బారిన పడి ప్రాణాపాయస్థితికి వెళ్తున్నారు. కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న దేశాల్లో ఎక్కువ మంది వైద్యులు మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో వైద్యుల సంరక్షణ చర్యల్లో భాగంగా వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు తమ వైద్యులు, వైద్య సిబ్బందికి పాయింట్లు నిర్దేశించి డ్యూటీలు కేటాయిస్తున్నాయి. కరోనా చికిత్సలో పాల్గొంటున్న వైద్యులు, వైద్య సిబ్బంది వయసు, ఆరోగ్యస్థితి తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుంటూ వారికి స్కోర్‌ ఇస్తున్నాయి. ఈ స్కోర్‌ ఆధారంగా అన్ని విధాలుగా ఫిట్‌గా ఉన్న వారికి మాత్రమే కరోనా చికిత్సకు అనుమతిస్తూ..ఇతర సమస్యలున్న వారిని స్థాయి ఆధారంగా కరోనేతర విభాగాల్లో, పరిపాలన విభాగాల్లో విధులు కేటాయిస్తున్నారు. ఇప్పటికే అమెరికా, లండన్, ఆ్రస్టేలియా, బ్రెజిల్‌ తదితర దేశాల్లో వైద్యులు, సిబ్బందిని విభజించి విధులు కేటాయిస్తున్నారు. దీంతో వారియర్స్‌ను రిస్క్‌లోకి లాగకుండా ఉండటంతో పాటు పేషెంట్లకు మెరుగైన సేవలు అందించే పరిస్థితి ఏర్పడుతుంది.

స్కోర్‌ ఆధారంగా విధులు
ఆస్పత్రుల్లో చికిత్స చేసే వైద్యులు, వైద్య సిబ్బందికి తొలుత స్కోర్‌ నిర్దేశిస్తున్నారు. పేషంట్‌ వయసు, జెండర్‌ కేటగిరీకి మార్కులు వేస్తారు. కరోనా వైరస్‌ ప్రభావం మహిళల్లో కంటే పురుషుల్లో ఎక్కువ ప్రభావం ఉండటంతో కరోనా వార్డుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. హృదయ సంబంధిత వ్యాధులు, హైపర్‌ టెన్షన్, డయాబెటిస్, ఊపిరితిత్తుల వ్యాధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, ఒబెసిటీ, కుటుంబ నేపథ్యం ఆధారంగా మార్కులు ఇస్తున్నారు. స్కోర్‌ 0–3 మధ్య ఉన్న వారు తక్కువ రిస్‌్కగా పరిగణిస్తూ వాళ్లకు అన్ని రకాల డ్యూటీలకు పంపుతున్నారు. స్కోర్‌ 4–6 మధ్య ఉన్న వారికి నాన్‌ కోవిడ్‌ వార్డుల్లో డ్యూటీలు వేస్తుండగా... వారు పీపీఈ కిట్లు ధరించేలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. కొందరికి పాలనపరమైన విభాగాల్లో విధులు కేటాయిస్తున్నారు.

స్కోర్‌ 7 కంటే ఎక్కువగా ఉన్న వారికి ఆస్పత్రిలో ప్రత్యక్ష విధులకు దూరంగా ఉంచుతూ..టెలీమెడిసిన్‌ విభాగాల్లో విధులు కేటాయిస్తున్నారు. ఈ పని విభజనతో వైద్యులు, సిబ్బంది ఆరోగ్యాన్ని రిస్క్‌లో పడకుండా ఉంటుందని, పేషంట్లకు పూర్తి స్థాయిలో సేవలు అందించవచ్చని అమెరికాకు చెందిన ఓ సంస్థ పరిశీలన చెబుతోంది. ఈ తరహా విధానాన్ని అమలు చేయాలని స్థానిక వైద్యులు డిమాండ్‌ చేస్తున్నారు. కరోనా వార్డుల్లోకి గర్భిణీ వైద్యులు, వైద్య సిబ్బందికి మాత్రమే అనుమతి లేదు. జనాభా నిష్పత్తితో పోలిస్తే మన దేశంలో వైద్యులు, వైద్య సిబ్బంది తక్కువగా ఉన్నందున జాగ్రత్తగా వర్క్‌ ఫోర్స్‌ను డీల్‌ చేయాలని డాక్టర్స్‌ అసోసియేషన్, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్లు డిమాండ్‌ చేస్తున్నాయి.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)