amp pages | Sakshi

తెలంగాణలో ఒక్కరోజే 117 కేసులు 

Published on Fri, 05/29/2020 - 02:41

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే 117 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నలుగురు చనిపోయారు. నమోదైన కేసుల్లో తెలంగాణకు చెందిన 66 మందికి కరోనా సోకింది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారిలో మరో 49 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇద్దరు తెలంగాణకు చెందిన వలస కార్మికులని ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన బులెటిన్‌ విడుదల చేశారు. మొత్తం ఇప్పటివరకు రాష్ట్రంలో 2,256 మంది కరోనా బారిన పడ్డారని తెలిపారు. వారిలో తెలంగాణకు చెందిన కేసులు 1,908 ఉండగా, వలసదారులకు సంబం ధించినవి 175, సౌదీ అరేబియా నుంచి వచ్చినవి 143 కేసులు, సడలింపులు ఇచ్చాక విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా 30 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 67 మంది చనిపోయారు. మొత్తం 1,345 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 844 మంది చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 58, రంగారెడ్డి ఐదు, మేడ్చల్‌ రెండు, సిద్దిపేట జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి.  

ట్రాఫిక్‌ ఏఎస్సైకి కరోనా
గౌలిపురా డివిజన్‌కు చెందిన ట్రాఫిక్‌ ఏఎస్సై (53) కరోనా సోకింది. ఖైరతాబాద్‌ బీజేఆర్‌నగర్‌కు చెందిన ఓ వృద్ధురాలు కరోనా సోకి మృతి చెందగా, ఆమె కుటుంబంలోనే మరో 8 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. నార్త్‌లాలాగూడ ఇందిరానగర్‌ ప్రాంతానికి చెందిన రైల్వే రిటైర్డ్‌ ఉద్యోగి బిజ్జిరామ్‌ (81)కు కరోనా సోకడంతో  గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పహాడీషరీఫ్‌లో మరో 8 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

ఇద్దరు విమాన ప్రయాణికులకు ‘కరోనా’
శంషాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికులకు కరోనా లక్షణాలు కనిపించడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం యూకే– 877 విమానంలో ముంబై నుంచి వచ్చిన  వీరిద్దరు విదేశాల నుంచి వచ్చినట్లు సమాచారం.

గ్రేటర్‌లో రోజూ దుకాణాలు తెరచుకోవచ్చు
హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని రకాల దుకాణాలను ఇక నుంచి ప్రతిరోజూ తెరిచేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Videos

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)