amp pages | Sakshi

తాడో.. పేడో

Published on Tue, 11/06/2018 - 11:22

కాంగ్రెస్‌ గెలుపు గుర్రాల ప్రకటనకు తుది కసరత్తు జరుగుతున్న వేళ.. తాడో పేడో తేల్చుకునేందుకు జిల్లా నేతలు సిద్ధమయ్యారు. ఈ దశలో ఏఐసీసీ ప్రతినిధులు, స్టీరింగ్‌ కమిటీ సభ్యులను ప్రసన్నం చేసుకునే దిశగా చివరి ప్రయత్నాలకు పదును పెట్టారు. అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ మంగళవారం ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ విషయం తెలిసిన ఆశావహులు ఎలాగైనా టికెట్‌ దక్కించుకోవాలనే పట్టుదలతో ఢిల్లీ బాట పట్టారు. ఇప్పటికే పలువురు నేతలు దేశ రాజధానిలో మకాం వేయగా.. మంగళవారం ఉదయం ఢిల్లీ చేరుకునేలా మరికొంత మంది ఏర్పాట్లు చేసుకున్నారు. ముఖ్యంగా తాండూరు, వికారాబాద్‌కు చెందిన ఆశావహులు కొద్ది రోజులుగా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

  సాక్షి, వికారాబాద్‌: జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా విడుదల కానుందనే సమాచారంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొడంగల్, పరిగి స్థానాలు తాజా మాజీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డికి ఇప్పటికే ఖరారయ్యాయని తెలుస్తోంది. దీంతో వీరు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు సెగ్మెంట్లలో వీరికి పోటీ కూడా లేకపోవడంతో అధిష్టానం వీరి పేర్లను ఖరారు చేసిందని సమాచారం.  

మహరాజులు వర్సెస్‌ రోహిత్‌రెడ్డి... 
తాండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున టికెట్‌ కోసం రసవత్తర పోటీ సాగుతోంది. నాలుగైదు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో అన్నీ తామై పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న మహరాజుల కుటుంబం, ఇటీవల పార్టీలో చేరిన యంగ్‌లీడర్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు రోహిత్‌రెడ్డి మధ్య టికెట్‌ పోరు తార స్థాయికి చేరింది. టికెట్‌ సాధనకోసం ఇప్పటికే మహారాజుల కుటుంబం నుంచి రాకేష్, నరేష్‌లు ఢిల్లీలో పైరవీలు ముమ్మరం చేశారు.
 అదే విధంగా రోహిత్‌రెడ్డి సైతం ఢిల్లీలో తనకు అనుకూలమైన నేతలతో టికెట్‌ వేటలో ఉన్నారు. ఈ తతంగం జరుగుతుండగానే మాజీ ఎమ్మెల్యే నారాయణరావు వర్గీయులు సోమవారం తన అనుచరులతో కలిసి నగరంలో టీపీసీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వద్దకు వెళ్లి టికెట్‌ తమ వర్గానికే ఇవ్వాలని కోరినట్లు సమాచారం.

తాండూరు నియోజకవర్గంలో 65 శాతానికి పైగా ఉన్న బీసీలకే కాంగ్రెస్‌ టికెట్‌ కేటాయించాలని, కొన్ని దశాబ్దాల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కాదని ఇతర వర్గాలకు ఇస్తే పార్టీ ఓడిపోయే ప్రమాదముందని విన్నవించినట్లు తెలుస్తోంది. ఎలాగైనా సరే రోహిత్‌రెడ్డికి టికెట్‌ రాకుండా అడ్డుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటికప్పుడే పార్టీలో చేరినవారికి టికెట్లు ఇవ్వకూడదని.. రాహుల్‌ గతంలోనే ప్రకటించిన నేపథ్యంలో రోహిత్‌కు ఎట్టి పరిస్థితిలోనూ టికెట్‌ రాదనే ప్రచారం జరుగుతోంది.

 గెలుపు గుర్రాలకే టికెట్‌ ఇవ్వాలనే సూత్రం ప్రకారం రోహిత్‌రెడ్డికే టికెట్‌ వస్తుందని, వరుసగా ఓటమి పాలయ్యే మహరాజుల కుటుంబానికి గాని, ఆయన అనుచరులకు గాని టికెట్‌ ఇచ్చే అవకాశమే లేదని రోహిత్‌రెడ్డి వర్గీయులు పేర్కొంటున్నారు. మొత్తానికి టికెట్ల పంచాయితీ ఢిల్లీకి చేరింది. ఈ పరిణమాలన్నీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి మహేందర్‌రెడ్డి తనకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.

వికారాబాద్‌లో పోటాపోటీ...
వికారాబాద్‌ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్‌కుమార్, డాక్టర్‌.ఏ చంద్రశేఖర్‌ హోరాహోరీగా పోటీపడుతున్నారు. వీరు ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ ప్రతినిధులు, స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులను కలిసి లాబీయింగ్‌ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు రాష్ట్ర స్థాయి నేతలను కూడా కలిసి టికెట్‌ కోసం అభ్యర్థించారు. కాగా ఇద్దరు మాజీ మంత్రులు మాత్రం టికెట్‌ విషయంలో ఎవరికి వారే ధీమా వ్యక్తంచేస్తున్నారు. నియోజకవర్గంలో ఎవరికి వారుగా ప్రచారం చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ప్రకటిస్తుందని తెలియడంతో చివరి ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు.    
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)