amp pages | Sakshi

రాయితీ ఇంకా రాకపాయె!

Published on Mon, 07/30/2018 - 01:18

సాక్షి, హైదరాబాద్‌: స్వయం ఉపాధి యూనిట్ల లబ్ధిదారుల ఆవేదన అరోణ్యరోదన అయింది. రాయితీ రుణాల కోసం రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వంలో చలనంలేదు. నిరుద్యోగ యువతను స్వయం ఉపాధి యూనిట్ల వైపు ప్రోత్సహించేందుకు ఎస్సీ కార్పొరేషన్‌ విరివిగా రాయితీ రుణాలిచ్చేలా కార్యాచరణ రూపొందించింది. పెద్దసంఖ్యలో లబ్ధి కలిగించాలని భారీ ప్రణాళికలు రచించింది. వీటిని ప్రభుత్వం ఆమోదించడంతో లబ్ధిదారులను ఎంపిక చేసింది.

2017–18 ఆర్థిక సంవత్సరంలో 33,607 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. వీరికి రాయితీ రూపంలో రూ.454.01 కోట్లు అవసరమని ఎస్సీ కార్పొరేషన్‌ ప్రతిపాదనలు సమర్పించగా ప్రభుత్వం ఆమోదించింది. కానీ 27,261 మంది లబ్ధిదారులకు మాత్రమే రాయితీ యూనిట్లు మంజూరు చేసింది. ఈ మేరకు లబ్ధిదారులు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు.

కార్పొరేషన్‌ నిర్దేశించిన మేరకు రూ.351.26 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. కానీ, సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు కార్పొరేషన్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు 2016–17 ఆర్థిక సంవత్సారానికి సంబంధించిన రాయితీ రుణాల పంపిణీ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. దాదాపు 3610 మంది లబ్ధిదారులకు రూ.56 కోట్లు చెల్లించాల్సి ఉంది.

వార్షిక ప్రణాళికకేదీ ఆమోదం...
2018–19 సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్‌ రూ.వెయ్యి కోట్లతో వార్షిక ప్రణాళికను తయారు చేసి రెండు నెలల క్రితమే ప్రభుత్వానికి సమర్పించింది. ఇంకా ఆమోదం లభించలేదు. 50 వేల మందికి లబ్ధి చేకూర్చేలా భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాకపోవడంతో ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు అయోమయంలో పడ్డారు. ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే తొలి త్రైమాసిక ముగిసింది. ఇప్పటికిప్పుడు లబ్ధిదారుల ఎంపిక మొదలుపెట్టినా ప్రక్రియ పూర్తి కావడానికి కనిష్టంగా మూడు నెలలు పడుతుంది. బ్యాంకు నుంచి సమ్మతిపత్రాలు పొందడానికి,రుణాల మంజూరు పూర్తికావడానికి సమయం పడుతుంది. దీంతో రుణ ప్రణాళిక అమలు కష్టంగా మారే అవకాశముందని ఎస్సీ కార్పొరేషన్‌ యంత్రాంగం ఆందోళన చెందుతోంది. వార్షిక ప్రణాళికకు ఆమోదం లభించిన వెంటనే చర్యలు వేగవంతం చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)