amp pages | Sakshi

‘కోటి’ కాంతులు

Published on Thu, 12/06/2018 - 03:35

సాక్షి, హైదరాబాద్‌: ‘కంటి వెలుగు’కార్యక్రమం రికార్డు సృష్టించింది. రికార్డుస్థాయిలో కోటిమంది కళ్లల్లో వెలుగు నింపింది. ఒకవైపు ఎన్నికల ప్రచారం ఊపు మీదున్నా ‘కంటి వెలుగు’కార్యక్రమానికి ఏమాత్రం విఘాతం కలగలేదు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వ్యక్తమైంది. ఆగస్టు 15న ప్రారంభమైన కంటి వెలుగు కింద బుధవారం నాటికి కోటి మందికి కంటి పరీక్షలు చేయడం దేశంలోనే ఒక రికార్డు అని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అభివర్ణిస్తున్నారు. ఈ మేరకు ఆ శాఖ బుధవారం ప్రభుత్వానికి నివేదిక పంపింది. దాని ప్రకారం... కంటి పరీక్షలు చేయించుకున్న కోటి మందిలో 45.15 లక్షల మంది పురుషులు, 54.85 లక్షల మంది మహిళలున్నారు. కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో దాదాపు అందరూ 18 ఏళ్లకు పైబడినవారే. అంటే.. ఈ కోటి మంది ఓటర్లే కావడం గమనార్హం. వీరందరిపై అధికార పార్టీ ఆశలు పెట్టుకుంది. కోటి ఓట్లను కంటి వెలుగు ప్రభావితం చేస్తుందా లేదా అనేది చూడాలి. కంటి పరీక్షలు నిర్విఘ్నంగా కొనసాగుతుండటంతో లబ్ధిదారులు తమను గుర్తు పెట్టుకొని మరీ ఓటేస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 

సగానికిపైగా బీసీలే... 
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించి లోపాలను గుర్తించాలనేది సర్కారు ఆలోచన. తద్వారా అవసరమైన వారికి కళ్లద్దాలు ఇవ్వడం, ఆపరేషన్లు నిర్వహించడం దీని ఉద్దేశం. కంటి పరీక్షలు చేయించుకున్న కోటి మందిలో సగానికిపైగా బీసీలే కావడం గమనార్హం. ఈ వర్గాల వారంతా కూడా పేదలే కావడంతో కంటి సమస్యలను ఇన్నాళ్లు పట్టించుకోలేదు. చూపు కనిపించినా కనిపించకపోయినా అలాగే కాలం వెళ్లదీస్తూ వచ్చారు. అత్యవసర వైద్యానికే దిక్కులేనప్పుడు కంటి గురించి పట్టించుకునేవారే లేకుండా పోయారు. చివరకు ఎలాగోలా ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహించడంతో వారంతా ఆనందంలో ఉన్నారు.  

16.66 లక్షల మందికి రీడింగ్‌ గ్లాసులు... 
కంటి పరీక్షలు చేయించుకున్న కోటి మందిలో 36.61 శాతం మందికి ఏదో ఒక కంటి లోపం ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. అందులో 16.66 లక్షల మందికి అక్కడికక్కడే ఉచితంగా రీడింగ్‌ గ్లాసులు ఇచ్చారు. వారుకాకుండా చత్వారంతో బాధపడుతున్నవారు 12.95 లక్షల మంది ఉన్నారు. వారికి ప్రత్యేకంగా కళ్లద్దాలు తయారు చేసి ఇవ్వాలని నిర్ణయించారు. అందులో ఇప్పటివరకు 1.96 లక్షల మందికి చత్వారం గ్లాసులు అందజేశారు. వీరుగాక 4.47 లక్షల మందికి క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ చేయాల్సి ఉందని నిర్ధారణకు వచ్చారు. మరో 2.49 లక్షల మందికి ఇతరత్రా ఆపరేషన్లు చేయాల్సి ఉంటుందని వైద్యులు తేల్చారు. అందులో కొందరికి ఇప్పటికే ఆపరేషన్లు చేసినా, ప్రస్తుతం ఎన్నికలు కావడంతో మిగతావారికి బ్రేక్‌ ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఆపరేషన్లు చేస్తారని అధికారులు చెబుతున్నారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)