amp pages | Sakshi

కంటతడిపెట్టిన సీఎం కేసీఆర్‌

Published on Sun, 04/30/2017 - 10:01

హైదరాబాద్‌: తెలంగాణ జలయోధుడు విద్యాసాగర్‌రావు మృతదేహాన్ని చూసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కంటతడిపెట్టారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ సతీసమేతంగా విద్యాసాగర్‌రావు నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. విద్యాసాగర్‌రావుతో తన అనుబంధాన్ని గుర్తుకుతెచ్చుకున్న సీఎం కళ్లు చెమర్చారు. తెలంగాణ రైతుల దీనగాథలను అప్పట్లో ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్‌కు పాఠాలుగా విద్యాసాగర్‌రావు బోధించారు. కేవలం పునాది రాళ్లకే పరిమితమైన తెలంగాణ ప్రాజెక్టులను చూసి తీవ్ర ఆవేదన చెందే విద్యాసాగర్‌రావు కేసీఆర్‌కు ఆ విషయాలు వివరించేవారు.

కృష్ణా, పెన్నా బేసిన్‌ల మధ్య ఉమ్మడి ఏపీలో నిర్మించిన పోతిరెడ్డి పాడు తెలంగాణకు ఉరితాడు అవుతుందని హెచ్చరించారు. కృష్ణా జలాల అంశంలో నీటి దామాషాను పాటించకుంటే వచ్చిన నీటిని వచ్చినట్లు ఎగువ రాష్ట్రాలు వాడుకుంటాయని, అలా జరిగితే అది దిగువ రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని తొలిసారిగా తేల్చిచెప్పింది విద్యాసాగర్‌రావే. ‘నీళ్లు–నిజాలు’పేరిట ఆయన రాసి న పుస్తకంలో... ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పక్షపాత ధోరణితో తెచ్చిన జీవోలు, వాటితో జరిగే నష్టం, తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్న తీరుని వివరించారు. నీటిపారుదల రంగంలో అపార అనుభవం ఉన్న విద్యా సాగర్‌రావును రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌.. సాగునీటి సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం, పాలమూర రంగారెడ్డి ప్రాజెక్టుల డిజైన్‌లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. మూత్రాశయ క్యాన్సర్‌తో విద్యాసాగర్‌రావు శనివారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే.

సంబంధిత మరిన్ని కథనాలకై చదవండి

సాగునీటి స్వాప్నికుడు ఇకలేరు

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌