చైతన్యానికి చిరునామా ‘చిట్యాల’

Published on Sat, 11/24/2018 - 09:21

సాక్షి, చిట్యాల (నకిరేకల్‌) :  చైతన్యానికి చిరునామా చిట్యాల మండలం. ఈ మండలంలో నాటి సాయుధ తెలంగాణ పోరాటంతో పాటు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న చరిత్ర చిట్యాల మండల ప్రజలది. అంతేకాదు ఈ మండలం రాజకీయ చైతన్యానికి కూడా పెట్టింది పేరుగా ఉంటూ వస్తోంది. చిట్యాల మండలానికి చెందిన ఎందరో నాయకులు చట్ట సభలకు ప్రాతి నిధ్యం వహించారు. కాగా ప్రస్తుతం రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో చిట్యాల మండలానికి చెందిన ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. నకిరేకల్‌ శాసనసభ(ఎస్సీ రిజర్వుడు)కు పదిహేను మంది అభ్యర్థులు రంగంలో ఉండగా అందులో చిట్యాల మండలానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. మరొకరు నల్లగొండ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా చిట్యాలలో నివాసం ఉంటూ జెడ్పీహెచ్‌ఎస్‌లో పదవ తరగతి వరకు చదువుకున్న పైళ్ల శేఖర్‌రెడ్డి భువనగిరి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్నారు.

 అభ్యర్థి  పార్టీ   గ్రామం      నియోజకవర్గం
కాసర్ల లింగయ్య  బీజేపీ గుండ్రాంపల్లి   నకిరేకల్‌
మేడి సత్యనారాయణ  తెలంగాణ ప్రజాపార్టీ  పిట్టంపల్లి  నకిరేకల్‌
జిట్ట నగేష్‌    సీపీఎం     చిట్యాల     నకిరేకల్‌
నూనె వెంకటస్వామి  బీఎస్‌పీ  చిట్యాల      నకిరేకల్‌
మేడి నరేష్‌  సమాజ్‌వాదిపార్టీ వనిపాకల      నకిరేకల్‌
గాదె శ్రీను   బహుజన ముక్తి పార్టీ  శివనేనిగూడెం
కంచర్ల భూపాల్‌రెడ్డి    టీఆర్‌ఎస్‌    ఉరుమడ్ల     నల్లగొండ 


 
      
    
     
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ