amp pages | Sakshi

మెట్రో పోలీస్

Published on Sun, 06/22/2014 - 01:19

... ఇక సూపర్ కాప్
 సేఫ్, స్మార్ట్ సిటీగా రాజధాని.. ఎక్కడికక్కడ ట్రాకింగ్ వ్యవస్థ
 ఐక్యరాజ్యసమితి భద్రతా దళాల తరహాలో ప్రత్యేక డ్రెస్‌కోడ్
 ఆధునిక హంగులతో 1,650 ఇన్నోవా వాహనాలు
 ల్యాప్‌టాప్‌లు, జీపీఎస్, ఇంటర్‌నెట్, వైర్‌లెస్ వ్యవస్థలు
 ‘గల్లీ గస్తీ’ పేరిట 1,500 బైక్‌లతో పెట్రోలింగ్
 పోలీసు అధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశాలు
 
 సాక్షి, హైదరాబాద్: ముదురు నీలం రంగు ప్యాంటు, లేత నీలం రంగు చొక్కా..ఇన్నోవా వాహనాలు, ల్యాప్‌టాప్‌లు,     జీపీఎస్, వేగమైన ఇంటర్‌నెట్, వైర్‌లెస్ వ్యవస్థ.. నిమిషాల్లోనే ప్రత్యక్షమయ్యే పోలీసులు.
 పాశ్చాత్య దేశాల్లో కనిపించే పోలీసింగ్ తీరిది.
 మరికొద్ది రోజుల్లోనే ఈ అత్యాధునిక పోలీస్ వ్యవస్థ
 మన హైదరాబాద్‌లో కనిపించనుంది.
 
ఐక్యరాజ్యసమితి భద్రతా బలగాల తరహాలో ఇక్కడి పోలీసులకు ఆధునిక సౌకర్యాలు సమకూరనున్నాయి. పోలీస్ అంటే ఖాకీ డ్రెస్, టోపీ, చేతిలో లాఠీ అనే విధానం ఇక కనుమరుగు కాబోతోంది. రాజధానిలో పోలీసు రూపురేఖలు పూర్తిగా మారిపోబోతున్నాయి. చైన్ స్నాచింగ్ దగ్గరి నుంచి తీవ్రమైన నేరాలదాకా అన్నింటినీ పూర్తి స్థాయిలో నియంత్రించి హైదరాబాద్‌ను సేఫ్ సిటీగా, స్మార్ట్ సిటీగా మార్చేందుకు తోడ్పడే సౌకర్యాలు పోలీసులకు అందబోతున్నాయి. బస్తీల్లో పహారా కోసం మోటారు సైకిళ్ల మీద ‘గల్లీ గస్తీ’ పోలీసులు రానున్నారు. నేరం ఎక్కడ జరిగినా.. పది నిమిషాల్లోగా పోలీసులు ఆ స్థలంలో ఉండేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నారు. రాష్ట్ర రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని యోచిస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆలోచనల మేరకు ఇవన్నీ అందుబాటులోకి రానున్నాయి.
 
 శనివారం తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్, సైబరాబాద్‌ల పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. తొలి ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో పోలీసు వ్యవస్థ తీరుతెన్నులను పూర్తిగా మార్చాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. లండన్, న్యూయార్క్ వంటి నగరాల్లోని పోలీసు వ్యవస్థను ఆదర్శంగా తీసుకుని తదనుగుణంగా మార్పులు చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఏ నేరం జరిగినా పది నిమిషాల్లో పోలీసులు సంఘటనా స్థలంలో ఉండాలని.. ఎక్కడికక్కడ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలకు పూర్తి రక్షణ కల్పించడం ద్వారా వారు అర్ధరాత్రి కూడా స్వేచ్ఛగా విధులు నిర్వహించుకునే పరిస్థితులు తీసుకురావాలని సూచించారు. హైదరాబాద్‌లోని ట్యాక్సీలు ముంబై తరహాలో కామన్ బ్రాండింగ్ (ఒకే రంగు వాహనాలు) కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాగా.. రాజధానిలో శాంతిభద్రతల సమస్యల పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ, ఇతర శాఖలతో పాటు మంత్రులతో త్వరలో సమావేశం నిర్వహించనున్నట్లు కేసీఆర్ చెప్పారు.  
 
 జూబ్లీహిల్స్‌లో పోలీసు భవనాలు: జూబ్లీహిల్స్‌లో గుర్తించిన ఎనిమిది ఎకరాల స్థలంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లను కొత్తగా నిర్మించాలని... ట్రాఫిక్, ఇతర నగర రక్షణ వ్యవస్థల ప్రధాన కార్యాలయాలన్నీ ఇక్కడి నుంచే విధులు నిర్వర్తించేలా బహుళ అంతస్థుల భవనాలను నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమావేశం అనంతరం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మీడియాకు వెల్లడించారు. పోలీసుల కొత్త డ్రెస్‌కోడ్ వీలైనంత త్వరలో అమల్లోకి వస్తుందని.. మిగతా నిర్ణయాలన్నీ ఆగస్టు 15లోగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. శాంతి భద్రతలు పరిరక్షించే పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులకు కూడా ఆధునిక హంగులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు కాలుష్యం బారిన పడకుండా రక్షణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. రిక్రూట్‌మెంట్ ద్వారా పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు హోంమంత్రి పేర్కొన్నారు.
 
 పాత వాహనాలకు చెక్
 హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రస్తుతమున్న పోలీసు వాహనాలను సమూలంగా మార్చివేయాలని ముఖ్యమంత్రి నిర్ణయిం చారు. వాటి స్థానంలో 1,650 కొత్త ఇన్నోవా వాహనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ వాహనాల్లోనే జీపీఎస్, 4జీ ఇంటర్‌నెట్, ల్యాప్‌టాప్, వైర్‌లెస్ వ్యవస్థ, సైరన్, అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ పోలీసులకు ప్రత్యేక బ్రాండ్ ఉండేలా డ్రెస్‌కోడ్‌ను వీలైనంత త్వరగా మార్చనున్నారు.
 
 1,500 బైకులతో ‘గల్లీగస్తీ’..
 
 హైదరాబాద్ నగరంలో పోలీసు పహారాను విస్తృతంగా పెంచేందుకు ‘గల్లీ గస్తీ’ పేరిట మోటారు సైకిళ్లతో కూడిన పెట్రోలింగ్ వ్యవస్థను కేసీఆర్ రూపొందించారు. బస్తీల్లో 24 గంటలూ పోలీసులు పహారా కాయడం వల్ల చైన్ స్నాచింగ్, దొంగతనాలు, ఆకతాయిల చేష్టలకు అడ్డుకట్ట పడుతుందని ఆయన పోలీసు అధికారులకు సూచించారు. ‘గల్లీ గస్తీ’ కోసం 1,500 కొత్త మోటారు సైకిళ్లను కొనుగోలు చేసి షిఫ్టుల వారీగా పోలీసులు పహారా కాసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తద్వారా ఎక్కడ నేరం జరిగినా 10 నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించే పరిస్థితులను కల్పించేలా వాహన వ్యవస్థను రూపొందించుకోవాలన్నారు. మహిళా ఉద్యోగులు, విద్యార్థినులకు స్వేచ్ఛ, భద్రత విషయంలో పోలీసులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, బస్టాపుల్లో పోలీస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉండాలని సూచించారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)