amp pages | Sakshi

'ప్రభుత్వం ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాలి'

Published on Fri, 08/29/2014 - 14:13

మెదక్: తెలంగాణలో రైతులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మెదక్ వచ్చిన ఆయన మాట్లాడుతూ... నిరంతర విద్యుత్ కోతలతో అటు రైతులను, ఇటు ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలని ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వానికి హితవు పలికారు. మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎట్టిపరిస్థితుల్లో మద్దతు ఇచ్చేది లేదని కుండ బద్దలు కొట్టి చెప్పారు.

ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ మండలానికో నియోజకవర్గానికి ఒకరికి ఇచ్చి చేతులు దులుపుకుందని ఆరోపించారు. అలాకాకుండా హరిజనులు, గిరిజనులకు మూడెకరాల భూమిని ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటూ వామపక్ష పార్టీలన్నీ ఏకమై పోరాటం చేస్తామని చాడ వెంకట్రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  అయితే టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి హరీష్ రావు వామపక్ష పార్టీల నేతలైన చాడ, తమ్మినేనిలను కలసి తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఈ రోజు ఉదయమే కలసి కోరిన సంగతి తెలిసిందే.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)