సాయుధ దళాల గ్యాలెంట్రీ 

Published on Tue, 07/03/2018 - 01:08

సాక్షి, హైదరాబాద్‌: సాయుధ దళాల్లో పనిచేస్తూ ప్రాణాలను లెక్కచేయకుండా ఉత్తమ ప్రతిభ కనబరిచి కేంద్ర ప్రభుత్వం గ్యాలెంట్రీ అవార్డులు అందుకున్న వారికి అందించే నగదు పురస్కారాన్ని పెంచుతూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతేడాది సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ.. గ్యాలెంట్రీ అవార్డు, శౌర్య చక్ర, పరమ్‌వీర్‌ చక్ర పొందిన జవాన్లకు నగదు పురస్కారం పెంచు తామని ప్రకటించారు. దీనికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంబంధిత గ్యాలెంట్రీలకు నగదు పురస్కారం పెంచుతూ ఉత్తర్వులిచ్చింది.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత పురస్కారాలు అందుకున్న వారి కి కూడా ఇది అమలవుతుందని తెలిపింది. అలాగే ఒకేసారి వివిధ గ్యాలెంట్రీలు పొందిన వారికి ఆయా కేటగిరీల కింద పెంచిన పురస్కారం అమల వుతుందని వెల్లడించింది. తెలంగాణలో పుట్టి, స్థానికత ఉన్నవారికే ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు. అవార్డు గ్రహీతలు రీజనల్‌/జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ కార్యాలయంలో అఫిడవిట్‌ దాఖలు చేసి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ